• search
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అవినీతిపై ఉక్కుపాదమే:ఎసిబితో సెంట్రల్ విజిలెన్స్ సమన్వయం

By Suvarnaraju
|

అమరావతి:ఎసిబితో సమన్వయం ద్వారా రాష్ట్రంలో అవినీతిపై ఉక్కుపాదం మోపనున్నట్లు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషనర్‌ కెవి చౌదరి తెలిపారు. విజయవాడలో ఎసిబి అధికారులతో సమావేశమైన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ శాఖాపరంగా తీసుకునే చర్యల గురించి ఆ శాఖ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన అవినీతి నిరోధంపై తీసుకుంటున్న చర్యల గురించి వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు ఎంతవరకూ సద్వినియోగం అవుతున్నాయి?...ప్రజలకు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయో ఎసిబి,విజిలెన్స్ శాఖలు రెండూ పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఆయా శాఖల్లో జరిగే అవినీతిపై దృష్టి సారించి లోపాలు జరిగితే బాధ్యులను గుర్తించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూడాలన్నారు.

 ఎసిబి పనితీరు...భేష్

ఎసిబి పనితీరు...భేష్

రాష్ట్రంలో ఎసిబి శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందని, గత ఏడాది ఎసిబి దాడుల శాతం మెరుగ్గా ఉందని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషనర్‌ కెవి చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే పట్టుబడిన కేసులకు సబంధించి అవినీతిని నిరూపించడం, త్వరగా శిక్ష పడేలా చేయడం చూడాల్సి ఉందన్నారు. అవినీతిపై సెంట్రల్‌ విజిలెన్స్‌ శాఖలో 4 స్పెషల్‌ ఫోర్స్‌ బృందాలు ఏర్పాటుచేసి వెనువెంటనే నేర నిరూపణకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామని కెవి చౌదరి అన్నారు.

 ముందుగానే...పసిగట్టాలి

ముందుగానే...పసిగట్టాలి

వివిధ ప్రభుత్వ సంస్థల పరిధిలో ఏం పనులు జరగడం లేదో ముందుగానే గ్రహిస్తే అవినీతిని ముందు గానే పసిగట్టేందుకు వీలు కలుగుతుందని దిశానిర్ధేశం చేశారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఇచ్చే టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్‌లలో ఉన్న లొసుగులను, మెలికలను గ్రహిస్తే అవినీతి ఎలా జరుగుతుందో గ్రహించవచ్చని దీంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడొచ్చని తాను ఎసిబి అధికారులకు సలహా ఇచ్చినట్లు తెలిపారు.

 బ్యాంకు రుణాలు....అవినీతి ఇలా

బ్యాంకు రుణాలు....అవినీతి ఇలా

బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు అసలు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించకపోవడం, తీసుకున్న రుణం తీసుకున్న ఆ యూనిట్‌కే వినియోగించారా లేదా అనేది పట్టించుకోకపోవడమే బ్యాంకు రుణాల ఎగవేతకు ప్రధాన కారణమని అన్నారు. కొత్త రుణం ఇచ్చినట్లు చూపించి పాత రుణం క్లియర్‌ అయినట్లు చూపించడం వంటివి కూడా అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతోందని తెలిపారు.

 సంస్కరణలు...సమన్వయం

సంస్కరణలు...సమన్వయం

అవినీతి నిర్మూలనలో ఎసిబికి సెంట్రల్‌ విజిలెన్స్‌ నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అలాగే వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావొచ్చనేది కూడా తమకు కూడా సూచించవచ్చని ఎసిబితో చెప్పానన్నారు. వ్యవస్థాగత అవినీతిని అరికట్టేందుకు తీసుకురావలసిన సంస్కరణలపై విజిలెన్స్‌ అధికారులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామన్నారు. మీడియా సమావేశంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషనర్‌ కెవి చౌదరితో పాటు ఎసిబి డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌పి ఠాకూర్‌ పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

విజయవాడ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,28,486
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  42.72%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  57.28%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  18.45%
  ఎస్సీ
 • ఎస్టీ
  3.77%
  ఎస్టీ

English summary
The Central Vigilance Commission would introduce new integrity index system with co ordination with ACB to monitor the functioning of the government officials and various departments, said CVC Commissioner KV Chowdary.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more