బాబుకు షాక్: బాంబు పేల్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఉండవల్లి ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోలవరం ప్రాజెక్టు అంశంపై బాంబు పేల్చారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుంటే కేంద్రం గ్రాంట్‌గా ఇచ్చే నిధులు అప్పుగా మారుతుందని చెప్పారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాం, బాబు లక్ష్మీపార్వతి కారు డోర్ తీసేవారు: దగ్గుబాటి, జూ.ఎన్టీఆర్‌పై...

పోలవరంపై కేంద్రం గడువు

పోలవరంపై కేంద్రం గడువు

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అంశంపై కేంద్రం గడువు విధించిందని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ లోగా పూర్తి కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులు అప్పుగా మారుతుందని ఆయన చెప్పారు.

ఏపీ పైనే భారం

ఏపీ పైనే భారం

2018 మార్చిని కేంద్రం ప్రాజెక్టు పూర్తికి గడువుగా పెట్టిందని దగ్గుబాటి చెప్పారు. కేంద్రం ప్రాజెక్టుకు గ్రాంట్లు ఇస్తుంది కానీ, ఆ లోగా పూర్తి కాకుంటే గ్రాంట్ అప్పుగా మారి, ఆ డబ్బు భారం అంతా ఏపీపై పడుతుందని తేల్చి చెప్పారు.

అమరావతి మరో బాహుబలి

అమరావతి మరో బాహుబలి

ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో మరో బాహుబలి చూపిస్తున్నారని దగ్గుబాటి ఎద్దేవా చేశారు. తన పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు.

కమీషన్ల కోసమే.. ఉండవల్లి సంచలనం

కమీషన్ల కోసమే.. ఉండవల్లి సంచలనం

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కావడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నెలకు రూ.10 వేల కోట్ల అంచనాలు పెంచుతున్నారన్నారు. కమీషన్ల కోసమే కేంద్రం నుంచి ప్రాజెక్టు పనులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Daggubati Venkateswara Rao on Thursday said that Central Government give deadline for Polavaram project. He said Andhra Pradeh government should completed Polavaram before March 2018.
Please Wait while comments are loading...