పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వైసీపీకి భారీ ఊరట..!!

ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్, ఫలితంపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు వేళ ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు ఎవరికి ఓటు వేసారనే దాని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ దశలో ఈ ఓట్ల లెక్కింపు పైన తాజాగా సీఈవో కీలక ఆదేశాలు ఇచ్చారు.

తాజా ఆదేశాలు
బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా.. లేదా.. అని మాత్రమే చూడాలని మీనా ఆదేశించారు.

CEO Meena made key guide lines over Postal ballot validation in counting process

కలెక్టర్లకు మార్గదర్శకాలు
ఈ మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపినట్లు సీఈవో మీనా వెల్లడించారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వెనక రిటర్నింగ్ అధికారి సీల్ వేయడం.. ఆయన బాధ్యతే అని స్పష్టం చేశారు. అదే విధంగా ఫెసిలిటేషన్ సెంటర్‌లో గెజిటెడ్ అధికారి సంతకం చేయడం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారులు బాధ్యతే అని గుర్తు చేశారు. వీటిని అడ్డుగా చూపి ఇన్‌వ్యాలిడ్‌గా పరిణించకూడదన్నారు.

ఎవరికి కలిసొచ్చేను
సీఈవో ఆదేశాలతో పార్టీలకి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. తమ హాయంలో ఇచ్చిన ఉద్యోగాలతోనే ఈ సారి పోస్టల్ బ్యాలెట్ సంఖ్య పెరిగిందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. టీడీపీ కూటమి చెబుతున్నట్లుగా ఏకపక్షంగా పోస్టల్ బ్యాలెట్ ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఆమోదం పైన వస్తున్న కొన్ని సందేహాలకు సమాధానం వచ్చింది. ఈ తాజా ఆదేశాలతో తమ ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+