వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తా: బాబు, ఫోన్లో బిజీబిజీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 15 కల్లా పట్టిసీమ నుంచి నీళ్లు వస్తాయని చెప్పారు. ఎనిమిది పంపుల ద్వారా పోలవరం కుడికాలువకు నీళ్లు మళ్లిస్తామన్నారు.

జూలై 31వ తేదీ నాటికి కుడికాలువ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలపై ఇప్పటికై నాలుగైదుసార్లు సమీక్షించానని, చరిత్రలో ఎక్కడా లేనివిధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రెండు నెలల కారంలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు.

సీసీ కెమెరాల ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు పనులు పరీశీలిస్తానన్నారు. పట్టిసీమ, పోలవరం పనులను ఆయన పరిశీలించారు. గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో జూలై ఏడో తేదీ నుంచి నమూనా పుష్కరాలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

మరోవైపు, చంద్రబాబు రాజమండ్రి పర్యటన ఆద్యంతం ఉత్కంఠ మధ్య నడిచింది. చంద్రబాబు పలుమార్లు సెల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. మధురపూడి విమానాశ్రయానికి మధ్యాహ్నం మూడన్నరకు చేరుకున్నారు. దాదాపు ఇరవై నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ తాజా పరిణామాల నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది.

 చంద్రబాబు

చంద్రబాబు

గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన వివిధ నిర్మాణ పనులను నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులకు రూ.800 కోట్లు మంజూరు చేశామని, పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. ఇంకా

చంద్రబాబు

చంద్రబాబు


చంద్రబాబు మాట్లాడుతూ... పనుల నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. జరుగుతున్న పనులు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. ఈ నెల 25న మరోసారి తాను రాజమండ్రి వస్తానని, అప్పటికి పనులు పూర్తికావాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

జూలై 1నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుందని, అదే రోజు తాను రాజమండ్రి వచ్చి గోదావరికి నిత్యహారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తానన్నారు. ఇప్పుడు మొదలుపెట్టబోయే గోదావరి హారతి కార్యక్రమం రాబోయే రోజుల్లో అత్యంత గొప్పగా సాగుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించటం ద్వారా పుష్కరాల పుణ్యస్నానం చేసిన అనుభూతిని కలిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు రాజమండ్రి రావాలనుకుంటున్న భక్తులు నగరంలోకి తేలికగా ప్రవేశించే వీలులేకుండా పోలీసులు ప్రతిపాదిస్తున్న ఆంక్షలు సరికాదని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

500 సిసి టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని, వేలాదిమంది పోలీసులను నియమించుకుని కూడా ఇలా ఆంక్షలు విధించడం సరికాదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఘాట్లకు నడిచి వెళ్లేలా ఆంక్షలు విధించటం వంటి ప్రతిపాదనలు సరికాదని, నగరమంతా బారికేడ్లు నిర్మిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా ఆంక్షలు విధిస్తే భయపడి రెండోరోజు నుండే భక్తులు రాజమండ్రి రావటం మానుకుంటారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

భక్తులకు ప్యాకెట్లలోనే మంచినీరు ఇవ్వాలని, తక్కువ ధరకు మంచినీటి బాటిళ్లు అమ్మే సంస్థలు ముందుకొస్తే వారికి అవకాశం కల్పించాలని సూచించినట్టు తెలిసింది.

 చంద్రబాబు

చంద్రబాబు

సమీక్షా సమావేశాల పేరుతో గంటలకొద్దీ అధికారులను సమావేశాలకే పరిమితం చేస్తే పనులు దెబ్బతింటాయని, మరీ అవసరమైతే ఉన్నతస్థాయిలోని అధికారులతో మాత్రమే, అది కూడా గంట లేదా రెండు గంటలు మాత్రమే నిర్వహించి ముగించాలని మంత్రులకు సూచించారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chanderababu Naidu visited west Gowdawari District launching several development work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X