రఘురామ రాజు కోసం చంద్రబాబు కీలక నిర్ణయం..!!

రఘురామ రాజు సీటు వ్యవహారం పైన కూటమిలో చర్చ సాగుతోంది. నర్సాపురం ఎంపీ స్థానం బీజేపీ కేటాయించకోవటంతో రఘురామ టీడీపీలో చేరారు. ఆయనకు ఉండి సీటు ఇస్తారనే ప్రచారం సాగింది. ఇదే సమయంలో ఉండి టీడీపీ అభ్యర్దిగా ఖరారైన రామరాజు క్యాంపులో ఆందోళన మొదలైంది. తాజాగా చంద్రబాబును ఉండి సీటు పైన రామరాజు కలిసారు. ఆ సమయంలో రఘురామ రాజు విషయంలో చంద్రబాబు తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు.

సీట్ల మార్పు
మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో కొన్ని సీట్ల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉండి సీటు వ్యవహారం పైన పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. రఘురామ రాజుకు ఉండి సీటు ఇస్తారనే సమాచారం తో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మద్దతు దారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నుంచి పిలుపు రావటంతో రామారాజు వెళ్లి అధినేతను కలిసారు. నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రామరాజు పైన తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. అదే సమయంలో రఘురామ రాజుకు ఏ విధంగా న్యాయం చేయాలనేది చూస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Chandra Babu meeting with Pawan Kalyan and BJP leders may finslise the seat changes

రఘురామ కోసం
జగన్ కారణంగా రఘురామ ఇబ్బంది పడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనమే రక్షించామని చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక పరిస్థితిని ఆలోచిస్తున్నామన్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు బీజేపీ నేతలు వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఈ మధ్యాహ్నం పవన్ తో సమావేశం కానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ భేటీలో రఘురామ సీటుతో పాటుగా మూడు పార్టీల్లో అభ్యర్దుల విషయంలో సర్దుబాట్ల గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం ఇప్పటికే నర్సాపురం సీటు విషయంలో మార్పు లేదని తేల్చి చెప్పింది. అయితే, బీజేపీ నర్సాపురం స్థానం ఇవ్వటానికి చంద్రబాబు చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సైతం ఇందుకు చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

Chandra Babu meeting with Pawan Kalyan and BJP leders may finslise the seat changes

చంద్రబాబు - పవన్ భేటీ
బీజేపీ నర్సాపురం సీటు వదులుకుంటే ప్రత్యామ్నాయంగా ఏలూరు ఇచ్చేందుకు సిద్దమని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అనపర్తి సీటు విషయంలోనూ ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక..యలమంచిలి సీటు జనసేన నుంచి టీడీపీకి...అదే విధంగా మాడుగుల సీటులో అభ్యర్ది మార్పు..తిరువూరులో అభ్యర్ది మార్పు గురించి వస్తున్న డిమాండ్లు వంటి వాటి పైన చర్చించనున్నారు. ఇక, రఘురామ కు ఉండి సీటు ఇవ్వాల్సి వస్తే రామరాజుకు ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపించాలనే దాని పైన ఈ ఇద్దరు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+