జగన్ గెలుపును చంద్రబాబు ముందే ఒప్పుకున్నారా..ఆ మాటలకు అంతర్యం ఏమిటి..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను టార్గెట్ పెట్టుకుని అధికార వైసీపీ పార్టీ బరిలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేపట్టారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను మార్చడానికి జగన్ సన్నద్ధం అవుతున్నారు.
ఇక ఇదే సమయంలో ఎలాగైనా రాబోవు ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని టీడీపీ-జనసేన కూటమి పావులు కదుపుతుంది. ఈ మేరకు చంద్రబాబు, పవన్‌లు సమావేశమై పలు దశల్లో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలోకొంత సందిగ్ధత నెలకొంది. మరి కొద్దిరోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ..రాబోవు ఎన్నికల్లో జగన్ గెలుపును టీడీపీ అధినేత చంద్రబాబు ముందే అంగీకరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొద్ది రోజులు క్రితం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీలో అడుగు పెట్టనని..రాష్ట్రానికి ఇక మీదట రానని చంద్రబాబు తేల్చి చెప్పారు.

అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చంద్రబాబుకు ముందే అర్థమైందని.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే ఊహగానాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. చంద్రబాబు మాటలు విన్న తరువాత టీడీపీ శ్రేణుల్లో సైతం ఇదే అనుమానం కలుగుతుంది. ఓటమిని తమ నేత ముందుగానే ఒప్పుకున్నట్టు ఉందని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.

అధికార వైసీపీని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షనేత ఇలా చౌకబారు మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా మారింది. జనసేనతో పొత్తు తరువాత గెలుపుపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు మాటలు పూర్తి నైరాశ్యంలోకి నెట్టేశాయి. గెలుపుపై పార్టీ అధినేతకే నమ్మకం లేకపోతే ఇంక సామాన్య ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications