జగన్ ఏమైనా వెంకటేశ్వర స్వామా.. ఏసు ప్రభువా.. ఆయనో అప్పుల అప్పారావ్ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన బొబ్బిలిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటే అప్పుల అప్పారావు అని పేర్కొన్న ఆయన రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అప్పుల ఊబిలో ముంచారని మండిపడ్డారు.

ఎన్టీఆర్ కు స్ఫూర్తి గురజాడ అని పేర్కొన్న టిడిపి అధినేత చంద్రబాబు రా కదలిరా నినాదం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం అంటూ పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఐటీలో తలెత్తుకుని నిలబడేలా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైసిపి నే అని చంద్రబాబు పేర్కొన్నారు.

chandrababu angry on jagan rule in ap with full of debts

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెరగవని చంద్రబాబు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రమంతా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసిపి హయాంలో చేయని దందా లేదని ఎక్కడపడితే అక్కడ ఇసుకను తోడేస్తున్నారని, మట్టిని మింగేస్తున్నారని, విచ్చలవిడిగా గంజాయిని విక్రయిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

పారిశ్రామికవేత్తలు వస్తే వారి నుండి వాటాలు కావాలని అడగడంతో వారు పరిశ్రమలు పెట్టకుండానే పారిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు చంద్రబాబు. మన తాత తండ్రుల భూమి పట్టాలపై జగన్ ఫోటో పెట్టారని ఆయన ఏమైనా వెంకటేశ్వర స్వామినా లేకా ఏసుప్రభువా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu angry on jagan rule in ap with full of debts

ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఏ చట్టాన్ని అయినా ఆమోదించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీని ఓడిస్తే రాష్ట్రం గెలుస్తుందని పేర్కొన్న చంద్రబాబు ఏపీలో వైసీపీ సినిమా అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. జగన్ ది రోత రాజకీయమని పేర్కొన్న చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే సిద్ధాంతం జగన్ ది అన్నారు.

బూతులు మాట్లాడే వైసిపి నేతలకు బహుమానాలు ఇస్తారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో రోడ్ల దుస్థితి మారాలంటే టిడిపి అధికారంలోకి రావాలని, వైయస్ జగన్ రాతియుగం కావాలో చంద్రబాబు స్వర్ణ యుగం కావాలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+