సెలబ్రిటీలకు బాబు, దేవినేని జాగీరుకాదని కేశినేని

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు స్మార్ట్ విలేజ్‌ల పైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖులుప గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ఆర్థిక, వ్యాపార లావాదేవీలు పెంచడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.

చంద్రబాబుతో కేంద్రమంత్రుల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రులు హర్షవర్ధన్, సుజనా చౌదరిలు భేటీ అయ్యారు.

Chandrababu appeals celebrities to adopt villages

సునామీ హెచ్చరికల వ్యవస్థ-సవాళ్లపై సదస్సు

ఇన్‌కాయిన్‌లో సునామీ హెచ్చరికల వ్యవస్థ-సవాళ్లపై సదస్సు జరిగింది. ఈ సదస్సును కేంద్రమంత్రులు హర్షవర్ధన్, సుజనా చౌదరిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడారు. సునామీని ముందుగా గుర్తించడంలో పురోగతి సాధించామన్నారు. మన వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు.

ముందస్తు హెచ్చరికలతో హుధుద్ నుండి ప్రజల ప్రాణాలను రక్షించామని సుజనా చౌదరి అన్నారు. భూభౌతిక శాస్త్రాల పైన బ్లూప్రింట్ రూపొందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల సహకారం అవసరమన్నారు.

దేవినేని జాగీరు కాదు: కేశినేని నాని

మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పైన ఉదయం ఘాటు వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని మధ్యాహ్నం మరోసారి మండిపడ్డారు. కృష్ణా జిల్లా దేవినేని జాగీరు కాదన్నారు. అందరినీ సమన్వయంతో నడిపించాల్సిన బాధ్యత ఆయన మీదే ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+