Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కులం రంగు పులుముకుంటున్న నిరసనలు..!!

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయం మారుతోంది. పార్టీల మధ్య పోరలో సామాజిక వర్గాల పేర్లు చర్చకు దారి తీస్తున్నాయి. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత టీడీపీ(TDP) శ్రేణులు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. చంద్రబాబు అరెస్ట్(Arrest) అక్రమం అంటూ ఆక్రోశించాయి.

ర్యాలీలు చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేసారు. కానీ, ఇప్పుడు ఈ నిరసనల రూటు మారుతోంది. చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనల తో రాజకీయంగా కొత్త వివాదం మొదలైంది.

Chandrababu arrest: Protests get caste colour, Have a look as how one community has displayed

వరుస పరిణామాలు: చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ(TDPకి అనుకూలంగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గ నిరసనలుగా ప్రచారం సాగుతున్నాయి. అదే సమయంలో వైసీపీ, ఆ పార్టీకి అండగా నిలుస్తారని భావించే మరో ప్రధాన సామాజిక వర్గంకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలే..కనిపిస్తున్న ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణంగా నిలుస్తున్నాయి.

చంద్రబాబుకు మద్దతుగా ఏపీ(AP)తో పాటుగా తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఇతర దేశాల్లోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. అయితే, తొలుత ఈ ర్యాలీలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించినట్లు అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, క్రమేణా ఈ మద్దతు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రకటనలపై అభ్యంతరం: చంద్రబాబుకు మద్దతు పేరుతో కొందరు చేస్తున్న ప్రకటనలు..తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో(AP Politics) ఆసక్తి కరంగా మారాయి. చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేస్తున్నవారికి 50శాతం ఫుడ్‌ సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించిన సూర్యాపేట వద్దనున్న ఒక హోటల్ ప్రకటించింది.

గతంలో ఇదే హోటల్ కు చెందిన వ్యక్తి చంద్రబాబు(Chandra Babu)కు అనుకూలంగా పోస్టులు చేసారు. ప్రభుత్వం, టీడీపీ వ్యతిరేకుల పైన పోస్టులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం, వైయస్సార్‌ అభిమానులు తమ కర్రీ పాయింట్ల వద్దకు రావద్దంటూ కేపీహెచ్‌బి కర్రీస్‌ పాయింట్ల సెక్రటరీ పేరుతో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇటువంటి పోస్టులతో ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ వినిపిస్తోంది.

Chandrababu arrest: Protests get caste colour, Have a look as how one community has displayed

సామాజిక వర్గాల ప్రస్తావన: చంద్రబాబు అరెస్ట్ పైన నిరసనల పైన అభ్యంతరాలు లేవని..ఇలా సామాజిక వర్గాల ప్రస్తావన పైనే కొందరు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయినా ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ (Lokesh)హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తున్న అంశాన్ని కొందరు తెర మీదకు తీసుకొస్తున్నారు.

చంద్రబాబు(Chandra Babu)కు మద్దతుగా నిలుస్తున్న పీవీ రమేష్, ఎల్వీ సుబ్రమణ్యం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అదే విధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్దతు చెబుతున్న నేతలు ఏపీలో పరిస్థితులు గమనించాలనే పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు(Chandra Babu)కు మద్దతు పేరుతో చేస్తున్న పోస్టింగ్స్.. నిర్ణయాలు ఎన్నికల వేళ ఏపీలో కొత్త మలుపు తీసుకుంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+