నారా భువనేశ్వరి కోసం పట్టుచీర కొన్న చంద్రబాబు..! రేటెంతో తెలుసా ?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి అన్యోన్య దాంపత్యం గురించి ఎన్నోసార్లు వినే ఉంటాం. అలాగే ఆమె కోసం చంద్రబాబు బయటికి వెళ్లినప్పుడు, వీలు కుదిరినప్పుడు షాపింగ్ కూడా చేస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో ఇవాళ బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ఇలాగే తన భార్య భువనేశ్వరి కోసం ఓ పట్టు చీర కొనుగోలు చేశారు. పర్చూరులో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన ఓ స్టాల్ లో ఇలా చీర కొనుగోలు చేశారు.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన గొల్లపాలెంలో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొనాల్సి ఉంది. అంతకు ముందే ఆయన స్థానికంగా సభా ప్రాంగణానికి సమీపంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అక్కడ వారు పెట్టిన వస్తువుల గురించి ఆరా తీశారు. ఇదే క్రమంలో చీరల స్టాల్ వద్దకు కూడా వెళ్లారు. ఉన్నట్లుండి ఓ పసుపు చీర ఆయనకు బాగా నచ్చింది. దీంతో వెంటనే దాని గురించి అడిగారు.

పట్టు చీర అని ఆ స్టాల్ నిర్వాహరాలు చంద్రబాబుకు చెప్పింది. దీంతో ఆయన రేటు అడిగారు. 12 వేలని చెప్పడంతో బేరమాడి 10 వేలకు దాన్ని తీసుకున్నారు. పక్కనే ఉన్న తన సహాయకులకు ఈ చీర తీసుకుని 10 వేలు ఇవ్వాలని అక్కడికక్కడే సూచించారు. దీంతో వారు చీరను తీసుకుని ఆమెకు డబ్బులు చెల్లించారు. భార్య భువనేశ్వరి కోసం చంద్రబాబు గతంలోనూ చీరలు తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి పట్టు చీర తీసుకోవడంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు ఆయన్ను గమనిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications