AP Cabinet: చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా వీరేనా..?
ఏపీలో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది. అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేయత, ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పటికే పలువురి పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కేబినెట్లో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ మంత్రులకు కూడా చోటు కల్పించాల్సి ఉంది. దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన చర్చల్లో దాదాపు ఖరారైన పేర్లు ఇలా ఉన్నాయి. మొత్తం 25 మంది మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో టీడీపీ నుంచి 19 లేదా 20 మంది మంత్రులు ఉండబోతున్నారు. జనసేనకు 3-4 మంత్రులు, బీజేపీకి 1-2 మంత్రుల అవకాశం దక్కబోతోంది.

టీడీపీ నుంచి మంత్రులుగా ఖరారైనట్లు చెబుతున్న పేర్లలో సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, వంగలపూడి అనిత, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, బోండా ఉమ, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయస్వామి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, ఎన్ఎండీ ఫరూక్, మాధవీరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే జనసేన నుంచి మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లో ఒకరు, సత్యకుమార్, పంచకర్ల రమేశ్, బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఇవాళ వీరి పేర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications