ఎన్టీఆర్ ఫోటో ట్వీట్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబు ఎమోషనల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుండే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా మళ్లీ అధికారంలోకి రావాలని వైసిపి. ఈసారి వైసీపీని గద్దె దించి పాలనా పగ్గాలు చేపట్టాలని టిడిపి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో పదేపదే ఏపీలోని జగన్ పాలనను టార్గెట్ చేస్తున్న చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పాలని పదేపదే సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రా కదలిరా పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రతిరోజు రెండు చొప్పున బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఉద్వేగ ప్రసంగాలు చేస్తున్నారు.

జగన్ పాలనలో జరిగిన నేరాలు-ఘోరాలు, జగన్ ప్రభుత్వం ప్రజలను చేస్తున్న మోసం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసి ప్రజలకు తన విజ్ఞప్తిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను ట్వీట్ చేసిన చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి… pic.twitter.com/rQq2PFsufO
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2024
1983 వ సంవత్సరంలో 41 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసి తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటారని తెలిపారు. దేశంలోనే మొదటిసారి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇక మళ్ళీ ఆ చరిత్ర పునరావృతం కావాలని, విధ్వంసకర పాలకుల పీడ వదలాలని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
తెలుగు జాతి విముక్తిని పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దాం అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటో ట్వీట్ చేసి ప్రజలు వచ్చే ఎన్నికలలో మార్పును కోరుకోవాలని విధ్వంసకర పాలన సాగిస్తున్న వైసీపీ నుండి విముక్తిని పొందాలని కోరారు.












Click it and Unblock the Notifications