రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రివర్స్ గేర్ వేసిన చంద్రబాబు, సొంత జిల్లాలో చెక్

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించి అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్ వ్యాపారులపై పంజా విసిరింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల అండదండలతో అక్రమంగా లేఔట్లు, వెంచర్లు వేసి ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుతో పాటు అన్నమయ్య జిల్లా (ఉమ్మడి చిత్తూరు జిల్లా)లో అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి ఇప్పుడు సినిమా కనపడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నాయకులకు అన్ని రకాలుగా, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చంద్రబాబు ప్రభుత్వం చెక్ పెట్టింది. అక్రమంగా ఏర్పాటు చేసిన లేఔట్లు, వెంచర్ల దగ్గర ప్రభుత్వ అధికారులు బోర్డులు పెడుతున్నారు.

Chandrababu government is checking real estate traders in joint Chittoor district

ఇది అక్రమంగా ఏర్పాట్లు చేసిన లేఔట్, వెంచర్లు, ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ముందు ముందు చట్టపరంగా లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని సంబంధిత అధికారులు బోర్డులు పెడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, చిత్తూరు నగరం, పలమనేరు, మదనపల్లె, పీలేరు, కాణిపాకం, బంగారుపాళ్యం, తవణంపల్లె ప్రాంతాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు, లేఔట్లు వేశారని అధికారులు గుర్తించారు.

పంచాయితీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వీరు అక్రమంగా లేఔట్లు, వెంచర్లు వేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇలాంటి అక్రమ లేఔట్లు, వెంచర్ల గురించి సమాచారం సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం స్వచ్చ ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు.

ఇలాంటి అక్రమ లేఔట్లు, వెంచర్ల లో ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్లు తీసుకుంటే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, ముందు జాగ్రత్తగా మీకు సలహాలు ఇస్తున్నామని సంబందిత అదికారులు బోర్డులు రాసి పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఔట్లు, వెంచర్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడంతో ఆ వ్యాపారులకు కూటమి ప్రభుత్వం చెక్ పెడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+