15నెలల్లో నేనిచ్చిన ఉద్యోగాలివే- అసెంబ్లీలో బయటపెట్టిన చంద్రబాబు.. !
ఏపీలో గతేడాది జూన్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో తమకు అధికారమిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో తాజాగా మెగా డీఎస్సీతో పాటు పలు ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే వీటిపై విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇలా అయితే 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ నెరవేరేది ఎప్పుడంటూ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో గత 15 నెలల్లో కూటమి సర్కార్ కల్పించిన ఉద్యోగాల జాబితాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు బయటపెట్టారు.
కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఇందులో 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు.ఏయే రంగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామనే విషయాన్ని సెక్టార్ల వారీగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చామనే వివరాల్ని కూడా వెల్లడించారు

కేవలం మెగా డీఎస్సీ ద్వారా 15941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9093, పోలీస్ శాఖలో 6100 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు ప్రకటించారు.
వర్క్ ఫ్రం హోం ద్వారా 5500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు.

ప్రైవేట్ సెక్టార్ లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎంస్ఎంఈలు, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో మొత్తం 3.48 లక్షల కల్పించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎవరు ఎక్కడ, ఎప్పుడు ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారు అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని సీఎం హమీ ఇచ్చారు. దీంతో ఉద్యోగాల కల్పన విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు చంద్రబాబు గట్టి జవాబు ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications