విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోంది: అభినందన సభలో చంద్రబాబు

అమరావతి: కృష్ణా పుష్కరాల విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో బుధవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాకంటే సిబ్బంది, ఉద్యోగులు ఎక్కువగా కష్టపడ్డారని అన్నారు. పోలీసులు కూడా పుష్కరాల్లో సేవ చేశారని మెచ్చుకున్నారు.

పోలీసులంటే లాఠీలు ఉపయోగిస్తారన్న చెడుభావం గతంలో ఉండేదని, పుష్కరాల పోలీసుల ఇమేజ్ పెరిగిందని అన్నారు. టెక్నాలజీ సాయంతో పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు. టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాలేదన్నారు. ఈ విజయం అన్ని వర్గాల ప్రజలది, అధికారులదని సీఎం తెలిపారు.

Chandrababu naidu congratulated police and ap officials in vijayawada

నది పారిన అన్ని ప్రాంతాల్లో పుష్కరస్నానాలు చేశారని చెప్పిన చంద్రబాబు, పారిశుద్ధ్యం విషయంలో పురపాలకశాఖ తీరు అభినందనీయమని కొనియాడారు. 17వేల మంది విద్యార్థులు పుష్కర సేవకులుగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఐవోటి కింద ముందుకు తీసుకువెళ్లడానికి ఈ పుష్కరాల అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు.

పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్‌ సమన్వయం బాగుందని, పక్కా ప్రణాళికతో పుష్కరాలను నిర్వహించారని అభినందించారు. కృష్ణా పుష్కరాలు మతాలకు అతీతంగా జరిగాయని.. ముస్లింలు, క్రైస్తవులు కూడా పుష్కర స్నానాలు చేయడం అభినందనీయమన్నారు.

ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేయడం, స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. ఇక డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ పుష్కర విధుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

పుష్కరాల్లో సాంకేతికను ఎక్కువగా వినియోగించుకున్నామని ఆయన తెలిపారు. ఈ విజయం వెనుక అందరి కృషి దాగి ఉందని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో అన్ని శాఖలతో సమన్వయంతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. సీఎం ప్రోత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+