Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగింది

Recommended Video

    Ap Assembly Results 2019 : చంద్రబాబు కొంప ముంచింది పవనేనా..?? || Oneindia Telugu

    2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది . ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ అడ్రెస్ గల్లంతు అయ్యింది. ఏ పార్టీ , ఏ రాజకీయ విశ్లేషకులు ఊహించని ఫలితాలు అందర్నీ విస్తు పోయేలా చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంతటి ఘనవిజయం వైసీపీ కూడా ఊహించి ఉండదు . ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఇంతటి ఘోర ఓటమికి కారణాలు ఏంటి అని అన్వేషించే పనిలో పడ్డారు ప్రజలు. అసలు వైసీపీ విజయం సాధించటానికి టీడీపీ ఇంతటి ఘోర పరాభవం మూట గట్టుకోవటానికి జనసేన పార్టీనే కారణం అన్న చర్చ జోరుగా సాగుతుంది.

    వైసీపీ విజయానికి పరోక్షంగా కారణం అయిన జనసేన

    వైసీపీ విజయానికి పరోక్షంగా కారణం అయిన జనసేన

    నేడు వైసీపీ సాధించిన విజయంలో జనసేన పరోక్షంగా, వైసీపీ విజయానికి కారణమైందని చెప్పాలి. అయితే అసలు విషయం ఏంటంటే గతఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన టీడీపీ ఈసారి ఒంటరిగానే పోటీకి దిగింది. ఇక జనసేన కూడా ఈసారి ఎన్నికల బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోవాలి అనుకుంది. కాగా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసినటువంటి జనసేన మాత్రం డిపాజిట్లు గల్లంతు చేసుకుంది. కనీసం జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా గెలవని పరిస్థితి . ఒకేఒక్క స్థానంలో విజయంతో సరిపెట్టుకుంది.

    టీడీపీ ఓటుబ్యాంకు కొల్లగొట్టిన జనసేన .. జనసేన కూడా టీడీపీ ఓటమికి ఒక కారణం

    టీడీపీ ఓటుబ్యాంకు కొల్లగొట్టిన జనసేన .. జనసేన కూడా టీడీపీ ఓటమికి ఒక కారణం

    అయితే ఈసారి టీడీపీ కి రావాల్సిన ఓట్లనన్నింటిని జనసేన చీల్చివేసిందని, అందువల్లనే తమ ఓటు బ్యాంకు దెబ్బతిందని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. అయితే ఒకవేళ జనసేన లేకపోతే మాత్రం, ఇప్పుడు జనసేనకు పడ్డ ఓట్లన్నీ కూడా టీడీపీకి పడి ఉండేవని, టీడీపీ శ్రేణులు అంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు పవన్ కళ్యాణ్ పార్టీకి పడింది. అది కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు . జనసేన వలన టీడీపీ ఓట్లన్నీ చీలిపోవడం వల్ల చాలా స్థానాల్లో అతి తక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీ అంతటి విజయాన్ని సొంతం చేసుకుందని, వైసీపీ విజయానికి జనసేన కారణమైందని తెలుగురాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.

    జనసేన నష్టం చేస్తుందని ఊహించలేకపోయిన చంద్రబాబు ... వాస్తవాలకు దూరంగా రాజకీయాలు చేసిన ఫలితం

    జనసేన నష్టం చేస్తుందని ఊహించలేకపోయిన చంద్రబాబు ... వాస్తవాలకు దూరంగా రాజకీయాలు చేసిన ఫలితం

    ఇక టీడీపీ సైతం జనసేన వల్ల వచ్చి పడే ఉపద్రవాన్ని ముందుగా ఊహించలేకపోయింది. పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు కానీ ఇంతగా మెజార్టీ స్థానాలు వైసీపీ ఖాతాలో వేసుకుంటుందని 40ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు గుర్తించలేకపోయారు. సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి గెలిపిస్తుందని అతి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు ఎట్టకేలకు దెబ్బ తిన్నారు . జనసేన వల్ల తమ పార్టీకి ఊహించని నష్టం జరిగిందని గుర్తించలేకపోయిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. అంతే కాదు చంద్రబాబు వాస్తవాలకు దూరంగా రాజకీయాలు చేశారు . మొత్తానికి చంద్రబాబు కొంప ముంచి జగన్ పార్టీకి జనసేన పరోక్షంగా మేలు చేసిందని చెప్పొచ్చు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+