గుడ్లవల్లేరు హిడెన్ కెమెరా ఘటనలో షాకింగ్ ! ఎస్పీ లేదంటున్నా మంత్రిని పంపిన చంద్రబాబు..!
కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల బాత్ రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితమే ఈ రహస్య కెమెరాలను గుర్తించి విద్యార్దినులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్ధినిలు నిన్న రాత్రి క్యాండిల్స్ తో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
విద్యార్థినుల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతన్న ఓ ప్రేమ జంట ఓయో రూమ్ కి వెళ్ళారని, ఆ అబ్బాయి వాళ్ళు సన్నిహితంగా గడిపిన వీడియో తీశాడని తెలుస్తోంది. ఆ రికార్డు చేసిన వీడియోను వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయగా...వారు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. ఆ అమ్మాయికి సీక్రెట్ కెమెరా ఇచ్చి అమ్మాయిల బాత్ రూమ్ లో పెట్టమని కోరినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి ఇలా కెమెరాను పెట్టాక 300 వీడియోల వరకూ రికార్డు చేసి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్పీ మాత్రం ఇవేవీ నిర్దారించడం లేదు. అసలు కెమెరాలే లేవని తేల్చేశారు.

కానీ ప్రుభుత్వం మాత్రం విద్యార్థినుల ఆందోళనతో స్పందించింది. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించినట్లు విద్యామంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాలేజీకి వెళ్లి వాస్తవ పరిస్ధితులు తెలుసుకోవాలని జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ ను ఆదేశించారు. దీంత వారు హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విచారణ జరుగుతోందని ఎస్పీ ప్రకటించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications