'వరంగల్' రిషికేశ్వరి ఆత్మహత్యపై చంద్రబాబు కలత, హెచ్చరిక

విశాఖ: సాగర తీరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శనివారం ఆయన బిజీగా గడిపారు. ఓ సందర్భంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ ఘటన పైన స్పందించారు.

నాగార్జున వర్శిటీలోని ర్యాగింగ్ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందానని చంద్రబాబు చెప్పారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వర్శిటీల ప్రక్షాళన చేపట్టినట్టు తెలిపారు. భవిష్యత్‌లో ఎవరైనా ఆడపిల్లల్ని బాధపెడితే, వారు చదువుకునేందుకు అవకాశం లేకుండా చేస్తామని హెచ్చరించారు.

సమాజాన్ని అవినీతి పట్టిపీడిస్తోందని, సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని అంతమొందిస్తానన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేశ, రాష్ట్ర ప్రజలకు, ఎన్నారైలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఇదిలాఉండగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి పార్లమెంటేరియన్ కందాళ సుబ్రహ్మణ్యం తిలక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు.

సాగర తీరం

సాగర తీరం

విశాఖపట్నం సాగర తీరంలో తొలిసారి నిర్వహించిన 69వ స్వాతంత్య్ర వేడుకలు విశాఖ నగరవాసులపై చెరగని ముద్ర వేశాయి.

సాగర తీరం

సాగర తీరం

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాల సవ్వడి మధ్య దేశభక్తిని చాటుతూ ఆడంబరంగా ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

 సాగర తీరం

సాగర తీరం

శనివారం ఉదయం ఎనిమిదింటికే బీచ్‌రోడ్డుకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 25 నిమిషాలపాటు కురిసిన కొద్దిపాటి వర్షం యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేసినా ఆ తర్వాత వరుణుడు శాంతించాడు.

 సాగర తీరం

సాగర తీరం

8.35 గంటలకు పోలీసు కవాతుతో స్వాతంత్య్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. సభాప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొమ్మిదింటికి చేరుకొని కొద్దిసేపయ్యాక జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 సాగర తీరం

సాగర తీరం

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్నాయి.

 సాగర తీరం

సాగర తీరం

అంతకుముందు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వశాఖల అధికారులకు ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేశారు.ఎదురుగా యుద్ధనౌకలు.. ఆకాశంలో హెలికాప్టర్లుఎన్టీఆర్‌ విగ్రహం నుంచి వైఎంసీఏ మధ్య ఉన్న బీచ్‌రోడ్డును పూర్తిగా స్వాతంత్య్ర వేడుకల కోసం జిల్లా

 సాగర తీరం

సాగర తీరం

తీరంలో మోహరించిన తూర్పు నావికాదళానికి చెందిన పలు యుద్ధనౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక పడవల్లో మెరైన్‌ పోలీసులు గస్తీ తిరిగారు.

సాగర తీరం

సాగర తీరం

సభాప్రారంభానికి ముందు, ఆ తరువాత నౌకాదళానికి చెందిన పలు హెలికాఫ్టర్లు ప్రాంగణం పైనుంచి ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనువిందు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+