నారా లోకేష్ ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై: డబుల్ డెక్కర్- జోష్
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సరికొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. అటు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఇటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.
ఈ క్రమంలో పారిశ్రామికరంగంలో అతి పెద్ద విజయాన్ని సాధించింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. ఆటొమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. బస్సుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ యూనిట్‌ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

75 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటైంది. అశోక్ లేలాండ్‌కు చెందిన అత్యాధునిక బస్సులు ఇక్కడ తయారవుతాయి. డీజిల్, ఎలక్ట్రిక్, డబుల్ డక్కర్ బస్సులు సైతం ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఏపీలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందే విషయంలో ఈ తయారీ ప్లాంట్ ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్రీన్ మొబిలిటీ, లాజిస్టిక్ దిశగా అతి పెద్ద ముందడుగు పడిందని పేర్కొన్నారు. స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్-డెక్కర్ బస్సులు కూడా ఇక్కడే తయారవుతాయని నారా లోకేష్ చెప్పారు.
అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను నారా లోకేష్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు రిప్లై ఇచ్చారు. దీన్ని రీట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇది మరో శుభవార్త అని అన్నారు. పారిశ్రామిక రంగంలో అతిపెద్ద విజయాన్ని సాధించామని వ్యాఖ్యానించారు.
Another good news for our people of Andhra Pradesh!
— N Chandrababu Naidu (@ncbn) March 20, 2025
Ashok Leyland’s state-of-the-art bus manufacturing plant near Vijayawada is a major boost to our industrial growth, creating jobs and driving skill development. The arrival of the Switch Electric Double-Decker Bus marks a step… https://t.co/30K9CK5Tl4
విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ ప్లాంట్ ఏర్పాటు కావడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక అనుకూల విధానాలకు అద్దం పట్టినట్టయిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, నైపుణ్యాభివృద్ధికి భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications