చంద్రబాబే సీఎం .. బాండ్ పేపర్ మీద రాసిస్తా... కాకుంటే జ్యోతిష్యం మానేస్తా.. నైషధం శివరామ శాస్త్రి

ఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .రాజకీయ నాయకులతో పోటాపోటీగా సీఎం ఎవరన్నదానిపై జ్యోతిష్య పండితులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. జగన్ సీఎం అవుతారని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా కొందరు జ్యోతిష్య పండితులు పెడుతుంటే జగన్ కాదు చంద్రబాబే సీఎం అని వాదిస్తున్నారు మరికొంత మంది జ్యోతిష్య పండితులు . మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రాజకీయాలపై జ్యోతిష్య పండితుల సంచలనాలు పెరిగిపోయాయి.

చంద్రబాబు సీఎం కావటం ఖాయం .. 100రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తా అన్న నైషధం శివరామశాస్త్రి

చంద్రబాబు సీఎం కావటం ఖాయం .. 100రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తా అన్న నైషధం శివరామశాస్త్రి

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావడం ఖాయమని ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, మంత్ర శాస్త్రనిపుణుడు నైషధం శివరామశాస్త్రి పేర్కొన్నారు . మెుత్తం 112 సీట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని మళ్లీ సీఎం పీఠం చంద్రబాబుదేనన్నారు శివరామ శాస్త్రి . ఇక ఆ విషయాన్ని తాను రూ.100 బాండ్ పేపర్ మీద రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

వైసీపీకి వచ్చేది 58 సీట్లే .. జనసేనకు 5 సీట్లే వస్తాయన్న జ్యోతిష్య పండితుడు నైషధం

వైసీపీకి వచ్చేది 58 సీట్లే .. జనసేనకు 5 సీట్లే వస్తాయన్న జ్యోతిష్య పండితుడు నైషధం

ఒక ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గెలుస్తారని తెలిపారు. వైసీపీకి 58 సీట్లు మాత్రమే వస్తాయని ఆయన లెక్క చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గాజువాకలో మాత్రమే గెలుస్తారని చెప్పిన ఆయన గాజువాకలో పవన్ కళ్యాణ్ 57,600 మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇది నిజం అన్నారు. ఒకవేళ కాకపోతే తాను జ్యోతిష్యం మానేస్తానని సవాల్ విసిరారు నైషధం శివరామ శాస్త్రి .

నైషధం సవాల్ కు స్పందించిన హేతువాద సంఘం... తాను చెప్పిన ఫలితాలపై కాన్ఫిడెంట్ గా ఉన్న నైషధం శివరామశాస్త్రి

నైషధం సవాల్ కు స్పందించిన హేతువాద సంఘం... తాను చెప్పిన ఫలితాలపై కాన్ఫిడెంట్ గా ఉన్న నైషధం శివరామశాస్త్రి

నైషధం శివరామశాస్త్రి సవాల్ పై హేతువాద సంఘం నాయకులు స్పందించారు. ఇదే నిజమైతే రూ.5లక్షలు బహుమానంగా ఇచ్చి శివరామశాస్త్రిని ఊరేగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే హేతువాద సంఘం నాయకుల ఆఫర్లను తిరస్కరించిన శివరామశాస్త్రి తాను చెప్పిందే నిజమవుతుంది . అప్పుడు చెంపలేసుకుని, తిరుమల వేంకటేశ్వరస్వామికి అంగ ప్రదక్షణ చేస్తే చాలని సూచించారు. మొత్తానికి రాజకీయ నాయకుల కంటే , పొలిటికల్ పార్టీల కంటే జ్యోతిష్య పండితులకు ఏపీలో సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తుంది. మరి రాబోయే ఫలితాలు ఈ జ్యోతిష్య పండితులను ఏం చెయ్యనున్నాయో మరి వేచి చూడాల్సిందే .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+