నాపై కేసుల వివరాలివ్వండి- ఎన్నికల వేళ డీజీపీకి చంద్రబాబు లేఖ..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవాళ ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన రాష్ట్రంలో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు.
ఈ ఐదేళ్ల కాలంలో తనపై పోలీసులు పలు చోట్ల నమోదు చేసిన కేసుల వివరాల్ని చంద్రబాబు కోరారు. ఎన్నికల్లో నామినేషన్ సమయంలో దాఖలు చేసే అఫిడవిట్ లో వివరాలు పొందుపర్చేందుకు వీలుగా వీటిని అడిగారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధీ తనపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్ సమయంలో ఇచ్చే అఫిడవిట్ లో పొందుపర్చాల్సి ఉంటుందని, ఈసీతో పాటు ప్రజలకూ వీటి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు. ప్రభుత్వంపై పోరాడే క్రమంలో తనపై రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో, వివిధ దర్యాప్తు సంస్ధలు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని చంద్రబాబు డీజీపీని కోరారు. ప్రజల కోసం తాను చేసిన పోరాటాల సమయంలో నమోదు చేసిన కేసుల వివరాలను దర్యాప్తు సంస్ధలు, పోలీసులు తనకు ఇవ్వలేదని తెలిపారు.
కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దిగా, మాజీ సీఎంగా, విపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తిచాలంటే 2019 జనవరి 1 నుంచి తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణాన అయినా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఏ వ్యక్తికీ తనపై పోలీసులు, దర్యాప్తు సంస్ధలన్నీ నమోదు చేసిన అన్ని కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆధీకృత సంస్ధగా మిమ్మల్ని ఈ వివరాలు అడుగుతున్నానని చంద్రబాబు తెలిపారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందని డీజీపీకి తెలిపారు.
-
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్-కేబినెట్లో మంత్రులతో సీఎం..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications