చిత్తూరు జిల్లాకు గిన్నిస్ రికార్డు..! చంద్రబాబు కుప్పం ఘనత..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దినీ పరుగులు తీయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విన్నూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే అందరికీ అందుతున్నాయి. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో (chittoor district) చేపట్టిన ఇలాంటి ఓ ప్రయత్నం సక్సెస్ కావడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు కూడా అందుకుంది.
గిన్నిస్ బుక్ లోకి చిత్తూరు జిల్లా (chittoor district)
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ-సైకిళ్ల తయారీని ప్రోత్సహించింది. ఇలా దాదాపు 5 వేలకు పైగా ఈ-సైకిల్స్ ను నియోజకవర్గానికి చెందిన ఇ-మోటరాడ్ సంస్థ తయారు చేసింది. వీటిని స్థానికంగా పంపిణీ చేశారు. ఇలా మొత్తం 5555 ఈ-సైకిల్స్ ను పంపిణీ చేయడం ద్వారా చిత్తూరు జిల్లా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలోని ఏ జిల్లాలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఈ-సైకిల్స్ తయారు చేసి పంపిణీ చేయలేదు.

5555 ఈ-సైకిళ్ల పంపిణీ
5555 ఇ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించిన చిత్తూరు జిల్లా అధికారుల్ని సీఎం చంద్రబాబు ఇవాళ అభినందించారు. పెద్ద ఎత్తున ఇ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డును సాధించినట్టు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందుకున్నారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్ల పంపిణీ చేపట్టారు. ఇప్పటికే కుప్పంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న చంద్రబాబు.. ఈ గిన్నిస్ రికార్డు ఘనతతో మరో మైలురాయి అధిగమించారు.

Took an e-cycle for a spin around Kuppam today, joined by fellow cycling enthusiasts. Loved it! pic.twitter.com/6GKCDmK05Q
— N Chandrababu Naidu (@ncbn) January 31, 2026
సూపర్ సైకిల్ ప్రత్యేకత ఇదే
గతంలో ఒకేసారి పెద్దమొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచి పెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించామని చంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు. ఇ-సైకిళ్ల వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఇ-సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టామన్నారు. 60 కిలో మీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చన్నారు. సైకిల్ ఎక్కడికైనా దూసుకెళ్తుంది అదే ఈ సూపర్ సైకిల్ అని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications