చంద్రయాన్ 3 సక్సెస్: మరో మైలురాయిని చేరాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము; చారిత్రాత్మకం: అమిత్‌షా!!

చంద్రయాన్ 3 నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నిప్పులు కక్కుతూ చంద్రయాన్ 3 భారతదేశ ఖ్యాతిని గగనతలంలోకి తీసుకు వెళ్ళింది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన ఎల్వీఎం 3 ఎం4 చంద్రయాన్ 3ని మోసుకువెళ్ళింది. గగనతలంలోకి దూసుకు వెళ్లిన చంద్రయాన్ 3 కక్షలోకి ప్రవేశించడంతో, ఎటువంటి ఇబ్బంది చోటు చేసుకోకపోవడంతో శాస్త్రవేత్తలందరూ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. చంద్రయాన్ 3 పైన భారతదేశం పెట్టుకున్న ఆశలు సాకారం అవుతాయని అందరూ భావిస్తున్నారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందంతో పాటు ఈ మిషన్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.

amitshahdraupadimurmuchandryan31

చంద్రయాన్ 3 తో అంతరిక్ష పరిశోధనలో భారతదేశం మరొక ముఖ్యమైన మైలురాయిని విజయవంతంగా చేరిందని ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది అంతరిక్ష శాస్త్ర సాంకేతికతలో దేశ పురోగతికి ఉపయోగపడుతుందని ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రతి ఒక్కరికి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో భారత్ చారిత్రాత్మకమైన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిందని అమిత్ షా తెలిపారు. తరతరాలు గుర్తుంచుకునే అద్భుతమైన అంతరిక్ష చరిత్రను లిఖిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ అమిత్ షా పేర్కొన్నారు.

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ రెండు రోజుల పర్యటనలో ఉన్నప్పటికీ చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో అంతరిక్ష చరిత్రలో ఇది కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని, ప్రతి భారతీయుడు గర్వించదగిన రోజని, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మన శాస్త్రవేత్తలకు సెల్యూట్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+