Janmabhoomi Express: జన్మభూమి ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పు..! ఆరోజు నుంచే..!
దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విశాఖపట్నం-లింగంపల్లి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ఇంటర్ సిటీ రైలు జన్మభూమి ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల కనెక్టింగ్ రైలుగా ఉన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ కొత్త సమయాల్లోని రైల్వే అధికారులు ప్రకటించారు. తాజా షెడ్యూల్ మేరకు ఇరువైపులా జన్మభూమి రైళ్ల సమయాలూ మారబోతున్నాయి. ఈ కొత్త సమయాలు కొత్త ఏడాదిలో ఫిబ్రవరి నెల 15 నుంచి అమల్లోకి వస్తాయి.
విశాఖపట్నం-లింగంపల్లి మధ్య రెండు వైపులా 12805, 12806 నంబర్లతో జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటిలో విశాఖ నుంచి లింగంపల్లికి వెళ్లే రైలు నంబర్ 12805 జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఇకపై విశాఖలో ఉదయం 6.20కి బయలుదేరనుంది. అనంతరం దువ్వాడకు 6.43కు, అనకాపల్లికి 6.58కి, యలమంచిలికి 7.13కు, తునికి 7.38కి, అన్నవరానికి 7.58కి, సామర్లకోటకు 8.33కి, రాజమండ్రికి 9.18కి, తాడేపల్లిగూడానికి 10.03కు, ఏలూరుకు 10.43కు, నూజివీడుకు 11.03కు, విజయవాడకు 12.02కు, తెనాలికి 12.45కు, గుంటూరుకు మధ్యాహ్నం 1.45కు, సత్తెనపల్లికి 1.56కు, పిడుగురాళ్లకు 2.22కు, నడికుడికి 2.43కు, మిర్యాలగూడకు 3.12కు, నల్గొండకు 3.42కు, రామన్నపేటకు 4.14కు, చర్లపల్లికి 6.05కు, సికింద్రాబాద్ కు 6.25కు, బేగంపేటకు 6.41కి, లింగంపల్లికి 7.15కు చేరుకుంటుంది.

అలాగే లింగంపల్లి నుంచి విశాఖకు వెళ్లే జన్మభూమి రైలు నంబర్ 12806 లింగంపల్లిలో ఉదయం 6.55కు బయలుదేరుతుంది. ఆ తర్వాత బేగంపేటకు 7.19కి, సికింద్రాబాద్ కు 7.35కు చర్లపల్లికి 7.59కి, రామన్నపేటకు 8.29కి, నల్గొండకు 8.59కి, మిర్యాలగూడకు 9.29కి, నడికుడికి 9.59కి, పిడుగురాళ్లకు 10.19కి, సత్తెనపల్లికి 10.44కి, గుంటూరుకు 11.35కి, తెనాలికి 12.50కి, విజయవాడకు మధ్యాహ్నం 1.30కి, నూజివీడుకు 2.13కి, ఏలూరుకు 2.43కి, తాడేపల్లి గూడెంకు 3.13కు, రాజమండ్రికి 4.08కి, సామర్లకోటకు 4.53కు, అన్నవరంకు 5.23కు, తునికి 5.43కి, యలమంచిలికి 6.08కి, అనకాపల్లికి 6.33కి, దువ్వాడకు 7.08కి, విశాఖకు 7.50కు చేరుకుటుందని అధికారులు తెలిపారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications