జైలు నుంచే భాను కిరణ్ దందాలు?: కోర్టుకు అధికారుల మొర
హైదరాబాద్: మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని తమ జైలు నుంచి చంచల్‌గుడా జైలుకు మార్చాలని చర్లపల్లి జైలు అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు. స్వయంగా జైలు సూపరిండింట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలు నుంచి భాను కిరణ్ దందాలు నిర్వహించడమే దీనికి కారణమని భావిస్తున్నారు.
ఈ పిటిషన్ రేపు శుక్రవారం విచారణకు రానుంది. ఇటీవల వెలుగు చూసిన ఓ దందాలో భాను కిరణ్ ప్రమేయం ఉన్నట్లు బయటపడిందని అంటున్నారు. చంచల్‌గూడా జైలులో ప్రత్యేక బ్యారక్‌లు ఉన్నందున భాను కిరణ్‌ను అక్కడికి మార్చాలని చర్లపల్లి జైలు అధికారులు కోరారు.

గతంలో చంచల్‌గుడా జైలులో బ్యారక్‌లు లేనందున భాను కిరణ్‌ను చర్లపల్లి జైలుకు పంపించారని, ఇప్పుడు బ్యారక్‌లు అందుబాటులో ఉన్నాయని వారు వాదిస్తున్నారు. చంచల్‌గుడా జైలులో 200 బ్యారక్‌లు ఉన్నాయని, ఆ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని వారు అంటున్నారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో పాటు అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. వాటి విచారణ సందర్బంగా భాను కిరణ్‌ను వివిధ కోర్టులకు తరలించి, తిరిగి తీసుకుని రావాల్సి ఉంటుంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications