ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటికి ! మాజీ మిత్రుడి సలహా..! జగన్ లక్కీ..!
ఏపీలో గత ఎన్నికలకు ముందు ఎన్డీయేతో జట్టు కట్టి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ఏడాదిగా విజయవంతంగా పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటికి రావాలని ఆయన పాత మిత్రుడు ఒకరు సలహా ఇచ్చారు. ఇంతకీ ఆయన చంద్రబాబుకు ఎందుకీ సలహా ఇచ్చారో ఓసారి చూద్దాం..
విశాఖ ఉక్కు కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కొరకు, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగాలని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ కోరారు. చంద్రబాబు శక్తేమిటో తమకు తెలుసన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి బతికున్నప్పుడు తామరిద్దరూ మాట్లాడుకున్నామని గుర్తుచేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుమ్మం ముందు తాకట్టు పెట్టారని చింతా మోహన్ ఆరోపించారు. డిసెంబర్ 31 లోపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోమని, కేంద్ర క్యాబినెట్లో తీర్మానం చేయాలని, అలా చేయకపోతే, టిడిపి మద్దతు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక సామాన్య కుటుంబంలో పుట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకొని, తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని బిలీనియర్ చేశాడని చింతా మోహన్ తెలిపారు. తాను మాత్రం తన కుమారుడికి ఏమీ చేయలేకపోయానన్నారు. ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డిని అభినందించక తప్పదని, చెన్నారెడ్డి కొడుకు సాధించలేనిది, విజయ భాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేనిది, వెంగళ రావు కొడుకు సాధించలేనిది, జనార్దన్ రెడ్డి కొడుకు సాధించలేనిది, వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ సాధించాడన్నారు.

జగన్ కష్టపడ్డాడని, ముఖ్యమంత్ర అయ్యాడని, అంతటితో ఆగి ఉంటే బాగుండేదని చింతా మోహన్ తెలిపారు. కానీ లిక్కర్ కుంభకోణంలో పడ్డాడన్నారు. తమ జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి కొడుకు మిధున్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారన్నారు. నిన్న ఆకుపచ్చ కండువాలు వేసుకుని, రైతు పోరు పేరుతో, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారని, అది సాధ్యం కాదన్నారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications