పవన్ కల్యాణ్ చేసిన పనికి క్షమాపణలు కోరిన చిరంజీవి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబం అనే మాట మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రారంభమైంది. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరు మెగాస్టార్ గా, మరొకరు పవర్ స్టార్ గా, ఇంకొకరు వ్యాపారాలు చూసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నప్పటికీ ముగ్గురూ ఒకేమాటమీద ఉంటారు. తెలుగు సినిమాలు మొదట్లో ఎక్కువగా చెన్నైలో షూటింగ్స్ జరుపుకునేవి.

ఆరోజుల్లో చెన్నైలో ఇల్లు కొనుగోలు చేసిన చిరంజీవి తన ఫ్యామిలీని అక్కడికి మార్చారు. మద్రాసుకు దగ్గరలోనే షూటింగ్ కు వెళ్లివస్తుండేవారు. అలా వెళ్లివస్తున్న సమయంలో కారు ను పార్క్ చేసిన ప్రాంతంలో డ్రైవర్ తో కొందరు చిరంజీవిని కామెంట్ చేస్తూ, ఏదో ఒకటి మాట్లాడుతూ డిస్టర్బ్ చేసేవారు. అలా ఎన్నిసార్లు చేస్తున్నప్పటికీ చిరంజీవి పట్టించుకోకుండా తన పని తాను చూసుకునేవారు. అయితే వారంతా ఇలా కామెంట్ చేస్తున్నారంటూ డ్రైవర్ పవన్ కల్యాణ్ కు చెప్పారు.

chirupawan

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కల్యాణ్ కామెంట్ చేసే బ్యాచ్ పై విరుచుకుపడ్డారు. అందులో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి పవన్ కల్యాణ్ ను తిట్టారు. కామెంట్ చేస్తుంటే కొట్టాను తప్పేముందంటూ పవన్ వాదనకు దిగారు. వెంటనే వారికి సారీ చెప్పమని చిరు పవన్ ను ఆదేశించారు. ఏమీ మాట్లాడకపోవడంతో దెబ్బలుతిని ఆసుపత్రిలో ఉన్న వ్యక్తి దగ్గరకు చిరంజీవి పవన్ కల్యాణ్ ను తీసుకువెళ్లారు. అతని తరఫును తాను క్షమాపణలు కోరారు.పవన్ చేత కూడా క్షమాపణలు చెప్పించి అతని ఆసుపత్రి చికిత్సకయ్యే ఖర్చులను కూడా భరించారు.వాస్తవానికి పవన్ కల్యాణ్ కు ఇష్టం లేకపోయినప్పటికీ అన్నయ్య బలవంతం చేయడంతో సారీ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+