పవన్ పై చిరంజీవి ఎమోషనల్ - చంద్రబాబుకు విషెస్..!!
ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. వైసీపీకి ప్రతిపక్షహోదా కూడా దక్కని పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో ప్రధాని మోదీ సహా ప్రముఖులు టీడీపీ కూటమి నేతలను అభినందిస్తున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాల పైన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తమ్ముడు పవన్ సక్సెస్ గురించి వస్తున్న విశ్లేషణలతో ఎమోషనల్ అయ్యారు. పవన్ ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
పవన్ కు ప్రశంసలు..
ఫలితాల పైన స్పందించిన చిరంజీవి ట్వీట్ చేసారు. పవన్ పైన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అందులో..డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే!..అంటూ అభినందించారు.

చంద్రబాబుకు అభినందనలు
దీనికి కొనసాగింపుగా.. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని పేర్కొన్నాు. చిరంజీవి మరో ట్వీట్ లో చంద్రబాబు,పవన్ ను అభినందించారు. ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు..అంటూ పేర్కొన్నారు.
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2024
రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి
ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ట్వీట్లు ఎన్నికల ఫలితాల వేళ వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications