పవన్ కళ్యాణ్ ప్రేమకు ఎమోషనల్ అయిన చిరంజీవి.. ఆ ఫోటోతో..

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. చిరంజీవి పుట్టినరోజున తన అన్న పైన తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. చాలా భావోద్వేగంతో చిరంజీవి చిన్నప్పటినుంచి కష్టపడి ఎదిగిన తీరును సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపజేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ప్రేమ
చిరంజీవి జీవితం వెలకట్టలేని జీవిత పాఠం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారని కొనియాడారు . విజయాన్ని వినమ్రతతో, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల తాను చిరంజీవి నుండే నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Chiranjeevi gets emotional over Pawan Kalyan love with a rare photo

పవన్ కళ్యాణ్ ట్వీట్ కు మెగాస్టార్ స్పందన
ఆయన తమ్ముడిగా పుట్టడం అదృష్టమని అన్నింటినీ భరించే శక్తి ఆయన నైజం కాబట్టే ఆయన విశ్వంభరుడు అయ్యాడని కొనియాడారు.ఇక పవన్ కళ్యాణ్ తనపై చూపించిన ప్రేమకు స్పందించిన చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తమ్ముడి పైన ప్రేమ కురిపించారు. జనసేనానికి విజయోస్తు అంటూ పేర్కొన్న చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ అన్నింటా విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని ఆస్వాదిస్తున్నా : చిరంజీవి
చిరంజీవి పవన్ కళ్యాణ్ కు చేసిన ట్వీట్ లో జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు! త‌మ్ముడు క‌ల్యాణ్‌... ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను అని పేర్కొన్నారు.

సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు అంటూ చిరంజీవి దీవెన
నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా అన్నారు. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది అని ఆయన తెలిపారు. ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు అంటూ దీవించారు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు అని పేర్కొన్నారు.

విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నా
అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి అని ఆకాంక్షించారు. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయన్నారు . నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను అంటూ ఇట్లు నీ అన్నయ్య అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చిన్ననాడు చిరంజీవి పుట్టినరోజు ఫోటోను పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+