విశాఖ కేంద్రంగా చిరంజీవి బిగ్ డెసిషన్ - లీక్ చేసిన మాజీ మంత్రి...!!

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న చిరంజీవి ఇప్పుడు సినిమాల పైనే ఫోకస్ చేసారు. ఏపీలోనూ పర్యటనలు చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన నేతలను మాత్రం కలుస్తున్నారు. కాగా.. ఇప్పుడు చిరంజీవి విశాఖ కేంద్రంగా తీసుకున్న తాజా నిర్ణయం కీలకంగా మారుతోంది. మాజీ మంత్రి చిరంజీవి ప్లాన్ గురించి లీక్ చేసారు. ఈ విషయం ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఆసక్తిని పెంచుతోంది.

చిరంజీవి వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన వైఎస్సార్సీపీ.. ఉలికిపాటు వెనుక పెద్ద టెన్షన్!
చిరంజీవి వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన వైఎస్సార్సీపీ.. ఉలికిపాటు వెనుక పెద్ద టెన్షన్!

విశాఖ కేంద్రంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టుకు సిద్దం అవుతున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైజాగ్‌లో సినిమా షూటింగ్‌లు, సినిమాటిక్ డెవలప్‌మెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Chiranjeevi Plans to Set Up Multiplexes in Visakhapatnam MLA Ganta Srinivas reveals the details

సినిమా షూటింగ్స్ గురించి ప్రణాళికలు ఖరారు సమయంలో విశాఖ కేంద్రంగా కొంత పార్ట్ ప్లాన్ చేయాలని కోరారు. అదే సమయంలో తాను చిరంజీవిని కలిసిన సమయంలో ప్రస్తావించిన అంశాలను వెల్లడించారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఆరు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ థియేటర్లను విశాఖలో ప్రారంభించారని.. చిరంజీవి సైతం త్వరలోనే కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఏపీ పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1.. పవన్ కళ్యాణ్ పాలనపై చిరంజీవి ప్రశంసలు
ఏపీ పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1.. పవన్ కళ్యాణ్ పాలనపై చిరంజీవి ప్రశంసలు

నిర్మాతలు నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన యాక్టివిటీస్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేసుకోవాలని గంటా కోరారు. కాగా.. మెగా ఫ్యామిలీతో గంటా శ్రీనివాసరావు కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న సుదర్శన్ థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి భారీ IMAX మల్టీప్లెక్స్ స్క్రీన్‌ను నిర్మిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో విశాఖపట్నంలోనూ చిరంజీవి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఏర్పాటు చేయబోతున్నారంటూ గంటా వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. విశాఖ కేంద్రంగా చిరంజీవి ఆలోచన కార్యరూపం దాల్చితే నగరానికి మరింత ప్రాధాన్యత పెరుగుతుందనే చర్చ మొదలైంది. అయితే, చిరంజీవి మల్టీప్లెక్స్ ల పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+