• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్..నేను అందుకే ఓడాము: రాజకీయాలపై చిరంజీవి సంచలనం : ఆ ఇద్దరికీ ఏం చెప్పారంటే..!

|

సైరా తన రాజకీయ ప్రస్థానం మీద మళ్లీ మాట్లాడారు. తన ఓటమికి కారణాలు బయట పెట్టారు. తొలి సారిగా జనసేన అధినేత పవన్ ఎన్నికల్లో ఎందుకు ఓడారో చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తాను ఎందుకు ఫెయిల్ అయిందీ వివరించారు. అదే సమయంలో తన సహ నటులు కమల్ హాసన్..రజనీ కాంత్ లకు కీలక సూచనలు చేసారు. సుప్రీంహీరో గా ఉన్న తాను రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోవటానికి ఒకటే ప్రధాన కారణమని వాపోయారు. సౌమ్యంగా ఉండే వారు రాజకీయాలకు అసలు సరిపోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. సైరా ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా చేసిన వ్యాఖ్యల పైన అటు తమిళనాడుతో సహా ఇటు ఏపీలోనూ చర్చ ప్రారంభమైంది.

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల మీద కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన..కాంగ్రెస్ లో విలీనం..కేంద్ర మంత్రిగా ప్రస్థానం వంటి అంశాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత దాదాపుగా రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. సైరా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ఆయన ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయల మీద స్పందించారు. సినీ హీరో ఉన్నంత కాలం తాను సుప్రీం హీరోగా నిలిచానని..రాజకీయాల్లో మాత్రం గెలవలేకపోయానని చెప్పుకొచ్చారు. కలగకమానదు. రాజకీయాలు అంటే టీ తాగినంత సులభం కాదన్నారు. ముఖ్యంగా సౌమ్యంగా ఉండే వారు రాజకీయాలకు అసలు సరిపోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుదెబ్బలు తినటానికి కూడా సిద్ధపడితేనే రాజకీయాల్లోకి రావాలన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులు మారొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలను డబ్బులు శాసిస్తున్నాయని పేర్కొన్నారు.

నేను..పవన్ అందుకే ఓడిపోయాం..

నేను..పవన్ అందుకే ఓడిపోయాం..

మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో తాను..2019 ఎన్నికల్లో తన సోదరుడు పవన్ ఓటమి మీద వ్యాఖ్యానించారు. 2009లో తాను తిరుపతి..పాలకొల్లులో పోటీ చేస్తే సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోయానని గుర్తు చేసారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ గాజువాక తో పాటుగా సొంత జిల్లాలోని భీమవరం నుండి పోటీ చేస్తే రెండు చోట్ల ఓడారని..అయితే.. తాము ఇద్దరం కూడా సొంత నియోజకవర్గాల్లో ఓడిపోవటానికి కారణం డబ్బు ప్రభావమే అంటూ వ్యాఖ్యానించారు.

  త‌మ్ముడు కంటే అన్న‌య్య బెట‌ర్‌... ప‌వ‌న్‌కు ఊహించ‌ని దెబ్బ‌ || Oneindia Telugu
  పవన్ కల్యాణ్ ఓటమికి

  పవన్ కల్యాణ్ ఓటమికి

  ప్రత్యర్ధి పార్టీల డబ్బు ప్రభావంతోనే ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని తెలిపారు. జనసేన రాజకీయాల గురించి చిరంజీవి ఎప్పుడు ఓపెన్ గా స్పందించలేదు. ఇప్పుడు తొలిసారి తన సోదరుడు పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం తనకు ఎదురైన పరిస్థితులే అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ తో పాటుగా నాగబాబు సైతం నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే..చిరంజీవి 2009 తిరుపతి నుండి గెలుపొందారు. కొద్ది రోజుల క్రితం పవన్ సైతం డబ్బు ఖర్చు చేయలేకే తమ పార్టీ అభ్యర్ధులు ఓడారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నయ్య సైతం తమ్ముడి వ్యాఖ్యలకు మద్దతుగా కామెంట్ చేసారు.

  కమల్..రజనీకాంత్ లకు చిరు సూచన

  కమల్..రజనీకాంత్ లకు చిరు సూచన

  అదే విధంగా తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ విజయం సాధిస్తుందని భావించానని..కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీ 37 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎక్కడా గెలవలేదు. ఇక రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నా..ఇప్పటి వరకు అధికారికంగా ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో..చిరంజీవి వారికి రాజకీయాలు వద్దంటూ సలహా ఇచ్చారు. రాజకీయాల్లో ఓటమితోపాటు ఎదురుదెబ్బలు తినటానికి కూడా సిద్ధపడితేనే రాజకీయాల్లోకి రావాలన్నారు. ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులు మారొచ్చని అభిప్రాయపడ్డారు.

  English summary
  mega star Chiranjeevi revelaed that he defeated in his own constituency because of his rival spent crores of money to defeat him. Same happened to Pawan Kalyan as well Chiranjeevi said. Chiranjeevi tells Kamal Haasan and Rajinikanth that Politics is only about money, Not worth it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X