పవన్‌కళ్యాణ్‌కు వదినమ్మ అపురూపమైన బహుమతి.. పొంగిపోయిన డిప్యూటీ సీఎం, వేడుకను పంచుకున్న చిరంజీవి!!
మెగా ఫ్యామిలీ బంధాలకు, అనుబంధాలకు అర్థం చెబుతోంది.. మెగా ఫ్యామిలీ కుటుంబం అంటే ఇలా ఉండాలని అన్నదమ్ముల మధ్య ప్రేమ ఇలా ఉండాలని, కుటుంబ సభ్యులందరూ ఇలా కలిసిమెలిసి ముందుకు సాగాలని అర్థమయ్యేలా చెబుతోంది. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అన్న నానుడిని నిజం చేస్తుంది. అనేక సందర్భాల్లో మెగా ఫ్యామిలీ మేమంతా ఒకటి అని చూపించింది.
పవన్ కోసం మెగా ఫ్యామిలీ
ఇక మెగా ఫ్యామిలీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం ఈసారి ఎన్నికలలో మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. ఎవరికి వారు పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్షిస్తూ తమ వంతుగా వచ్చి ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురంలోని ప్రముఖ రుక్కుటేశ్వర ఆలయంలో పవన్ కళ్యాణ్ కోసం పూజలు చేశారు. ఇక ఫైనల్ గా వారంతా కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ విజయం సాధించారు.

మెగా ఫ్యామిలీలో పవన్ విజయోత్సవం
అలాంటి ఇలాంటి విజయం కాదు.. జనసేన నుండి పోటీ చేసిన అందరూ ఈసారి విజయం సాధించారు 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ దూసుకుపోయింది. మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి వద్ద నిర్వహించిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
మరిది విజయాన్ని చూసి పొంగిపోయిన సురేఖ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను" అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ఘట్టాన్ని చూసిన మెగా ఫ్యామిలీ అంతా పులకించిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ మరిది పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని చూసి పొంగిపోయింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మురిసిపోయింది.
పవన్ కళ్యాణ్ కు సురేఖకు మధ్య అందమైన బాండింగ్
పవన్ కళ్యాణ్ కు సురేఖకు మధ్య అందమైన బాండింగ్ ఉంది. అమ్మ తర్వాత అమ్మగా సురేఖకు పవన్ ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు. ఇది అనేక సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. సురేఖ కూడా పవన్ కోసం ఎన్నికలముందు కూడా పిఠాపురం వెళ్లి తనకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది. మరిది మంత్రి కావడంతో సంతోషంతో పొంగిపోయింది. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలలో సురేఖ హడావిడి చేసింది.
వదినమ్మ బహుమతికి పొంగిపోయిన పవన్ కళ్యాణ్
తాజాగా పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఒక అందమైన అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. ఇక వదినమ్మ ఇచ్చిన బహుమతి చూసిన పవన్ కళ్యాణ్ సంతోషంతో పొంగిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒక ఇంపోర్టెడ్ పెన్నును బహుమతిగా ఇచ్చింది. పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెడుతూ సురేఖ మురిసిపోయారు. ఆపై మెగాస్టార్ చిరంజీవి,ఆయన సతీమణి సురేఖ పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటోలు దిగారు.
పవన్ కళ్యాణ్ కు వదినమ్మ(సురేఖ) బహుమతి..!!#PawanKalyan #Chiranjeevi #Surekha #DuputyCMPawanKalyan #Oneindiatelugu pic.twitter.com/Y9BlbYkPFL
— oneindiatelugu (@oneindiatelugu) June 15, 2024
మంత్రిగా ఆ పని చెయ్యాలంటూ వదినమ్మ కోరిక
అంతే కాదు అదే పెన్నుతో మంత్రిగా తొలి సంతకం చేయాలంటూ వదినమ్మ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. తెలుగు ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ వదిన అన్నయ్య అంటూ తాము ఇచ్చిన పెన్ను ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఉపయోగిస్తావని కోరుకుంటున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు పెన్ను బహుమతిగా ఇచ్చిన వీడియోను చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఇంపోర్టెడ్ పెన్ ధరపై నెట్టింట చర్చ
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్నదమ్ముల బంధం, ఫ్యామిలీ బాండింగ్ ఇలా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కు అన్నా వదినలు కలిసి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి పెన్ ధర ఎంత ఉంటుంది అని ఫాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఆ ఇంపోర్టెడ్ పెన్ మాంట్ బ్లాంక్ పెన్ అని దీని ధర దాదాపు 80000 నుంచి మూడు లక్షల వరకు ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications