యువతికి వేధింపు: సినీ నటుడు మాదాల రవి అరెస్ట్
హైదరాబాద్: సినీ నటుడు మాదాల రవిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యువతిని వేధించిన కేసులో మాదాల రవిని సైబర్ క్రైమ్ పోలీసులు (సీసీఎస్) పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. మాదాల రవి తెలుగులో పలు చిత్రాలలో నటించారు.
ప్రేమోన్మాది ఘాతుకం
చిత్తూరు జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది భూపతి కాల్పులు జరిపాడు. ప్రేమను నిరాకరించడంతో నాటు తుపాకీతో భూపతి కాల్పులు జరిపినట్లు తెలిసింది. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రామకుప్పం మండలంలోని యానాదికాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఉపాధ్యాయురాలిపై అత్యాచారం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కార్పొరేటర్ తనపై అత్యాచారం చేశాడని ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న నెల్లూరులోని ఓ హోటల్లో అశోక్ తనను రేప్ చేశాడని వెల్లడించింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అశోక్ పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications