మాతోనే ఆటలా ? తమిళనాడు గవర్నర్ పై సుప్రీం ఫైర్-రేపటివరకూ డెడ్ లైన్..!
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికీ, గవర్నర్ బీఎన్ రవికీ మధ్య నెలకొన్న పోరు ఇవాళ కీలక మలుపు తిరిగింది. డీఎంకే ప్రభుత్వంపై కోపంతో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు కూడా నిరాకరిస్తున్న గవర్నర్ బీఎన్ రవిపై అత్యున్నత న్యాయస్ధానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాతోనే పెట్టుకుంటారా అని ఏకంగా ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్రంగా మండిపడ్డారు. రేపటి లోగా తమ ఆదేశాలు అమలు చేయకపోతే తామే ఆదేశాలు ఇచ్చి అమలు చేయిస్తామని హెచ్చరించింది.
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన డీఎంకే మంత్రి పొన్ముడిని ఈ వ్యవహారంలో తాత్కాలికంగా విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీంతో పొన్ముడిని తిరిగి కేబినెట్ లోకి తీసుకునేందుకు సీఎం స్టాలిన్ సిద్దమయ్యారు. గవర్నర్ కు ఆయన ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. అయితే గవర్నర్ బీఎన్ రవి ఇందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. దీనిపై డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసు విచారిస్తున్న సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం.. గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడింది. గవర్నర్ సుప్రీంకోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని, కేంద్రం ఏం చేస్తుందని సీజేఐ ప్రశ్నించారు. రేపటి కల్లా మీ మనిషి వచ్చి మా ఆదేశాలు అమలయ్యాయని చెప్పాల్సి ఉంటుందని, లేకపోతే మేం తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు గవర్నర్ రవిని హెచ్చరించింది.
తమిళనాడు గవర్నర్ పట్ల, ఆయన వ్యవహారశైలి పట్ల తాము తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయన ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయన సుప్రీంకోర్టుతోనే పెట్టుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. మేం రేపటి వరకూ కళ్లు తెరుచుకునే ఉంటామని, రేపటి కల్లా తమ ఉత్తర్వులు అమలు కాకపోతే ఆయన సంగతి చూస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఆయనకు సలహాలు ఎవరిస్తున్నారో సరిగ్గా ఇవ్వాలని సూచించింది. సీఎం సూచించిన వ్యక్తిని మంత్రిగా నియమించడం రాజ్యాంగం ప్రకారం గవర్నర్ బాధ్యత అని తెలిపింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications