ఎర్రచందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, అయితే మీరు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు కీలక అంశాల పైన దిశా నిర్దేశం చేసారు. ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండాల్సిన హోమ్, మున్సిపల్, జైళ్ల శాఖలు పూర్తిగా పనిచేయడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. రెవెన్యూ శాఖలోనూ ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఈ శాఖల్లో పరిస్థితులు మరింతగా మెరుగుపడాల్సి ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి 100శాతం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చామని.. చంద్రబాబు పేర్కొన్నారు. ఎర్రచందనం గురించి చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు కీలక శాఖల పైన సమీక్ష చేసారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఏ పనిలో ఉన్నా మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయాలని.. రిపోర్టుల కోసం కలెక్టర్లను డిస్ట్రబ్ చేయొద్దని సూచించారు. ఎర్రచందనంపై కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని అన్నారు.

దాని విలువ లక్షల కోట్లు అని భావించామని... అయితే మీరు దాన్ని నార్మలైజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఎర్రచందనంపై ఇప్పటికైనా అధికారులు కచ్చితమైన ప్లానింగ్ చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని సూచించారు. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఎర్రచందనం యూనిక్ అని.. కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుందని.. అదే సమయంలో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులు పెద్దమొత్తంలో పరిష్కారం అవుతాయని తెలిపారు పోలీసు, రెవెన్యూ విభాగానికి వచ్చిన ఫిర్యాదులో 70 శాతం మేర ఉన్నాయని గుర్తు శారు. ఆర్ఓఆర్‌కు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో ఏపీలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం ప్రతీ ఏడాది కలుగుతుందని పేర్కొన్నారు. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్లను జారీ చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కార్డుపై ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో అంచనా వేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications