ప్రధాని పైనే చంద్రబాబు ఆశలు - కీలక మలుపు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారికంగా ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తో పాటుగా అమరావతి - పోలవరం పూర్తి చేయటం ఇప్పుడు చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ సమయంలో కేంద్రం సాయం కీలకం కానుంది. దీంతో..ప్రధాని మోదీతో రాష్ట్రంలోని ఆర్దిక, పాలనా పరమైన అంశాలను చర్చించనున్నారు. కేంద్ర మద్దతు కోరనున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు బీసీ జనార్దన్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ సహా తదితరులు ఢిల్లీ టూర్‌కి వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీలో పాలనలో కీలక అడుగులకు చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

CM Chandra Babu to meet PM Modi and Unions Minsters in his two days Delhi Visit

కేంద్ర సాయం కోరుతూ
ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించిన అంశాల పైన సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులు,అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు. పోలవరం, రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏఏ ప్రాజెక్టులు, స్కీములు కేంద్రం నుంచి రాబట్టొచ్చో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధానికి వివరించి.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ప్రధాని తో భేటీ వేళ
గురువారం ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఏపీకి సాయం చేయాలని కోరనున్నారు. ఏపీకి తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రధాని హామీ ఇవ్వటంతో...కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందనేది కీలకంగా మారుతోంది. అదే సమయంలో పారిశ్రామిక రంగాలకు రాయితీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు పోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారు. ముఖ్యంగా ఏపీలో పోలవరం పూర్తి చేయడం, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేలా కేంద్రమంత్రుల ఎదుట ప్రతిపాదనలు పెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+