75ఏళ్ళ వయసులోనూ యువకుడిలా సీఎం చంద్రబాబు.. ఆయన హెల్త్ సీక్రెట్స్ ఇవే!

ప్రస్తుత సమాజంలో 50 ఏళ్ల వయసు దాటింది అంటేనే చాలామంది కదలలేము, లేచి పని చేయలేము అనే పరిస్థితికి వస్తున్నారు. కానీ 75 సంవత్సరాల వయసులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు యువకులతో పోటీపడి పనిచేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలనాపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, పార్టీని కూడా క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడిగా, ఏపీ సీఎం గా నిమిషం కూడా తీరికలేని బిజీలో మంచి ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు.

ఆరోగ్యంపై సీఎం చంద్రబాబుకు మంచి అవగాహన
చంద్రబాబు ఆరోగ్యం కోసం ఏం చేస్తారు? ప్రతిరోజు ఏం తింటారు? ఆయన తన హెల్త్ విషయంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటారు? అనే విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం.ఏపీ సీఎం చంద్రబాబు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయనకు ఆరోగ్యం పైన మంచి అవగాహన ఉంది. అందుకే ప్రతిరోజు కచ్చితంగా చంద్రబాబు వ్యాయామం చేస్తారు.

CM Chandrababu Naidu is still a youth at the age of 75 These are his health and fitness secrets

Take a Poll

తన ఆరోగ్య రహస్యాలను చెప్పిన చంద్రబాబు
గతంలో వైసిపి హయాంలో చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కూడా ఆయన ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం, యోగ వంటివి సాధన చేశారు. ఇక చంద్రబాబు క్రమబద్ధమైన జీవితాన్ని ఫాలో అవుతారు. సమయం ప్రకారం తినడం, ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? ఏం తినాలి అనేది తెలుసుకొని తినడం చేస్తారు. ఆరోగ్యానికి వ్యాయామానికి ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చే చంద్రబాబు అనేక సందర్భాలలో తన ఆరోగ్య రహస్యాలను బయటపెట్టారు.

ఆహారంలో విషయంలో చంద్రబాబు కేర్
చంద్రబాబు క్రమం తప్పకుండా ఒకే సమయంలో భోజనం చేస్తారు. ఆయన ఆహారంలో నూనె, ఉప్పు, చక్కెర వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ దోశ వంటి వాటికి బదులు చంద్రబాబు ప్రతిరోజు ఒక ఆమ్లెట్ ను తింటారు. అలా తన డైట్ మార్చుకున్న చంద్రబాబు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రాధాన్యత నివ్వాలని, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతుంటారు.

ఆరోగ్యం కోసం చంద్రబాబు చేతి రింగ్
ఆరోగ్యం కోసం ఆయన వేలికి ఒక రింగు ను కూడా పెట్టుకున్నారు. ఆరా రింగ్ చంద్రబాబు ప్రతిరోజు తను ఎంత నిద్రపోతున్నారు. శరీరం పనికి ఎంత సన్నద్ధంగా ఉంది అనే విషయాలను తెలుసుకుంటారు. గుండె పనితీరును తెలుసుకుంటారు. పనిచేయడానికి శరీరం సన్నద్ధంగా లేదు అని భావిస్తే ఇంకో గంట సేపు ఆయన నిద్ర పోతారని ఆయనే స్వయంగా చెప్పారు.

అల్ట్రా హ్యూమన్ సెన్సార్ తో షుగర్ లెవల్స్
అంతేకాదు ఎప్పటికప్పుడు శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను తెలుసుకోవడానికి అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ను ఉపయోగిస్తున్నారు. తన శరీరం ఇచ్చే సంకేతాలను, ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాంకేతికతను ఆయన ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు లాగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడితే వయసు మీద పడినప్పటికీ యువకులతో పోటీపడి పని చేసుకోవచ్చు. ఉన్నంతకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+