సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు... నారావారిపల్లెలో షెడ్యూల్ ఇదే !

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. ఈ క్రమంలోనే పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. కాగా ప్రజలతో మమేకమవుతూ పండుగను జరుపుకోవడం చంద్రబాబుకు ఆనవాయతీగా మారింది.

సచివాలయం నుంచి నేరుగా నారావారిపల్లెకు..

కాగా సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం సాయంత్రం సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో నారావారిపల్లెకు బయలుదేరారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పండుగ వాతావరణంతో నారావారిపల్లె సందడిగా మారింది.

cm-chandrababu-reached-naravaripalle-for-sankranthi-celebrations

సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొననున్న కార్యక్రమాలు..

  • మంగళవారం ( జనవరి 13, 2025 ) ఉదయం 8:00 నారావారిపల్లెలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం
  • అనంతరం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం సందర్శన
  • రూ.70 లక్షలతో నిర్మించిన రంగంపేట-భీమవరం రోడ్డు నుంచి ఆలయం వరకు రహదారి ప్రారంభం

నారావారిపల్లెలో ప్రారంభాలు..

  • 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్ ప్రారంభం
  • రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ప్రారంభం
  • సంజీవని ప్రాజెక్టు ప్రారంభం

తిరుపతిలో ప్రారంభోత్సవాలు..

  • అలానే రూ.45 లక్షలతో నిర్మించిన రుయా ప్రభుత్వ ఆసుపత్రి - పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్
  • ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో బాయ్స్ హాస్టల్, రూ.5 కోట్లతో గర్ల్స్ హాస్టల్ ప్రారంభం

తిరుపతిలో శంకుస్థాపనలు..

  • మూలపల్లిలో రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు శంఖుస్థాపన
  • మూలపల్లి చెరువు సహా మరో 4 చెరువులకు నీటి సరఫరా ప్రాజెక్టు
  • రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయం

ఎస్వీ యూనివర్సిటీలో శంకుస్థాపనలు..

  • రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబ్స్
  • రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు
  • రూ.2.91 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణం

బుధవారం (జనవరి 15)..

  • కుటుంబ సమేతంగా గ్రామ దేవత నాగాలమ్మ ఆలయం సందర్శన
  • ప్రత్యేక పూజలు నిర్వహణ
  • తర్వాత నారావారిపల్లె నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+