ఏపీ.. ఊపిరి పీల్చుకో: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించే బాధ్యత నాది

Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారత రత్న అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. ఆయనకు ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి లేవనెత్తారు. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇచ్చేంత వరకూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని పునరుద్ఘాటించారు.

విజయవాడ పోరంకిలో ఏర్పాటైన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు చంద్రబాబు. ఈ సందర్బంగా తారకరామం- అన్నగారి అంతరంగం పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు.

CM Chandrababu reiterate the award of Bharat Ratna to NTR

ఎన్టీఆర్ 300పైగా సినిమాల్లో నటించారని, ప్రతి పాత్రలోనూ జీవించాడని చంద్రబాబు చెప్పారు. ఆయనలా ఇంత వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు మరొకరు లేరని అన్నారు. అన్ని రకాల పాత్రలను పోషించి ప్రజలను మెప్పించిన నటుడని వ్యాఖ్యానించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, కవి శ్రీనాథుడు వంటి సినిమాలను తీయడానికి ఎంతగానో పరిశోధనలు చేశారని, ఆ పాత్రల్లో నటించి అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు.

భగవంతుడిని ఎన్టీఆర్ రూపంలో చూస్తోన్నామని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, పౌరుషంగా ఎన్టీఆర్ చిరస్మరణీయులయ్యారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే మన తెలుగు జాతిని గౌరవించుకున్నట్టేనని చెప్పారు. జాతీయ భావాలతో ఓ ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు దేశంలో మరొకరు లేరిన కీర్తించారు.

CM Chandrababu reiterate the award of Bharat Ratna to NTR

రాయలసీమలో కరవు, దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లుగా భావించి ఎన్టీఆర్ విరాళాలు సేకరించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కోసం పని చేస్తోన్నామని చంద్రబాబు అన్నారు. ఇటీవలే స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌‌ను విడుదల చేశామని, స్వర్ణాంధ్రప్రదేశ్‌‌ను సాధించే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని పేర్కొన్నారు.

అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. చంద్రబాబును బాహుబలితో పోల్చారు. ఏపీ ఊపిరి పీల్చుకో.. చంద్రబాబు వచ్చాడు.. అంటూ ప్రశింసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+