డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పనున్న సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళల కోసం, వారి రుణాల చెల్లింపును సులభతరం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్వాక్రా మహిళల కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది.

డ్వాక్రా మహిళలకు శుభవార్త
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు సులువుగా అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టింది. ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు కూడా శుభవార్త చెప్పింది. ఇకపై డ్వాక్రా మహిళలు ఇంటి వద్ద నుండి డ్వాక్రా రుణాలు, పొదుపు చెల్లింపులను చేయడం కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

CM Chandrababu will tell the good news for Dwakra women

రుణాల చెల్లింపులకు డ్వాక్రా మహిళల ఇబ్బంది
డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలను చెల్లింపులు చేయడానికి ప్రతి నెల ఒకరికి బాధ్యత అప్పగిస్తారు. ఆ మహిళలు అందరి వద్ద నుండి డబ్బులు కలెక్ట్ చేసి బ్యాంకుకు వెళ్లి క్యూలైన్లో నిలబడి రుణ వాయిదాలను చెల్లింపు చేయాలి. దానికి వారికి ఆ రోజు బ్యాంకులోనే సరిపోతుంది.

ఇంటి నుండి నేరుగా రుణ చెల్లింపులకు యాప్
ఈ క్రమంలో ఈ సమస్యలను అధిగమించి మహిళలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభం చేసే విధంగా ఓ యాప్ ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మొబైల్ యాప్ తో డ్వాక్రా గ్రూపుల మహిళలు నేరుగా రుణ చెల్లింపులను చేయవచ్చు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే బ్యాంకులకు వెళ్లకుండా ఇంటి నుండే వారు సులభంగా రుణ చెల్లింపులను చేసుకోవచ్చు.

డ్వాక్రా మహిళలకు యాప్ తో లాభాలు ఇవే
యాప్ ని వినియోగించడం వల్ల డిజిటల్ లావాదేవీలను కూడా ప్రోత్సహించవచ్చు. కొన్ని సందర్భాలలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు రుణాలను చెల్లింపు చేయడానికి వసూలు చేసిన డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడం, వాటిని దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం నగదు బదిలీ మోసాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది .ఇక ఇంట్లో నుండి నేరుగా చెల్లింపులు చేయడంతో డ్వాక్రా మహిళల సమయం కూడా ఆదా అవుతుంది. త్వరలోనే ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+