కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్ .. బద్ధ శత్రువులైన చంద్రబాబు, లోకేష్ లు కూడా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేడు. కేసీఆర్ పుట్టిన రోజు సంధర్బంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదంతా ఒక ఎత్తయితే బద్ధ శత్రువు అయిన కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు చంద్రబాబు . ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్టంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జలవిహార్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించనున్నారు. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Recommended Video


సీఎం కేసీఆర్ కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఇక ఇదే సమయంలో తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం , కేసీఆర్ కు బద్ధ శత్రువు అయిన చంద్రబాబు కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ట్వీటర్లో తన శుభాకాంక్షలు తెలిపారు.

ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పిన లోకేష్
ఇక చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లోకేష్ తన ట్విట్టర్లో " తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడూ నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.." అని లోకేష్ ట్వీట్ చేశారు . ఇక ఏపీ తాజా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు .

కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్న జగన్ ... విషెస్ చెప్పిన విజయసాయి
కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.. చిరకాలం ఆయురారోగ్యాలతో ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో.. ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని.. జాతికి సేవ చేస్తూనే ఉండాలని కోరుకున్నారు.

సీఎం కేసీఆర్ కు గ్రీన్ గిఫ్ట్ ఇవ్వనున్న పార్టీ శ్రేణులు , అభిమానులు
ఇక మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ‘గ్రీన్'గిఫ్ట్ ఇచ్చేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. సోమవారం సీఎం 66వ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఒక్క రోజే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 2.5 లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలో 20 వేల మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొక్కలు నాటి తమ సీఎం పట్ల ఉన్న అభిమానాన్ని వ్యక్తం చెయ్యనున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ అభిమానులు .












Click it and Unblock the Notifications