''సలార్''కు జగన్ మద్దతు ..రఘురామకు చెక్..?
రాజకీయాల నుంచి సినిమాలను వేరు చేయలేమని మరోమారు నిరుపితం అవుతుంది. సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులైయ్యారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత సినిమా ఇండస్ట్రీతో వైరం పెంచుకున్నారు.టికెట్ల రేట్ల దగ్గర నుంచి .. స్పెషల్ షోలను ,బెనిఫిట్ షోలపై నిషేదం విధించారు. చిరంజీవి సినిమాకు సైతం స్పెషల్ షోలతో పాటు టికెట్ల రేట్లను కూడా పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు.
దీనిపై కొందరు నేరుగానే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. అయితే తొలిసారి వైసీపీ ప్రభుత్వం ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు మద్దతుగా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సలార్ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. అయితే పెరిగిన కాస్టింగ్‌తో ప్రస్తుతం టికెట్ల రేట్లు గిట్టుబాటు కాదని.. జగన్ ప్రభుత్వానికి సలార్ టీం స్పెషల్ అర్జీ పెట్టుకుందని సమాచారం.

దీనిపై ఏపీ ప్రభుత్వంపై సానుకూలంగానే స్పందించిందట. ఏపీలో సలార్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంతో పాటు, స్పెషల్ షోలకు సైతం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. సలార్ టికెట్ల రేట్లను పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుకపొలిటికల్ స్ట్రాటజీ ఉందని తెలుస్తుంది.
ప్రభాస్‌కు ఉభయ గోదావరి జిల్లాలో ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ ప్రభాస్‌ను అభిమానించే వారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభాస్ సినిమా టికెట్ల రేట్లను పెంచారని తెలుస్తుంది. ప్రభాస్ అభిమానుల ఓట్లను తమవైపు తిప్పుకునేలా చేసుకోవాలని అధికార పార్టీ ప్రణళికలు రచిస్తుంది. దీనికి తోడు ఉభయ గోదావరి జిల్లాల్లో రాజులు వర్సెస్ కాపుల మధ్య అధిపత్యపోరు నడుస్తుంది.

కాపులు అధిక సంఖ్యలో పవన్ కల్యాణ్ పార్టీకి అండగా ఉండటంతో.. రాజులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ ప్లాన్. తద్వారా తమ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సైతం చెక్ పెట్టవచ్చని అధికార పార్టీ ఆలోచన. 2019 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన రఘురామకృష్ణంరాజు కొద్దిరోజులకే సొంత పార్టీ మీద విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులను దగ్గర చేసుకోవడం ద్వారా రఘురామకృష్ణంరాజు గోదావరి జిల్లాల్లో ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓడించవచ్చని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. దీని కారణంగానే ఏపీలో సలార్ సినిమాకు టికెట్ల రేట్ల పెంచడంతో పాటు, స్పెషల్ షోలకు సైతం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి సలార్ విషయంలో అధికార పార్టీ వ్యూహాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications