సినీ పరిశ్రమ నుంచి సీఎం కోరుకుంటుందిదే- బయట పెట్టిన మంత్రి నాని : సీఎంకూ థియేటర్లున్నాయి..!!
సినీ ఇండస్ట్రీ కి ఏపీ పైన ఎటువంటి అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ నుంచి ఏం ఆశిస్తోంది. అసలు సీఎం జగన్ ఆలోచన ఏంటి. ఇప్పుడు కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలతో ఈ అంశాలపైన మరింత ఆసక్తి పెరిగింది. ఈ సమయంలో పలు ఆసక్తి కర అంశాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. కోల్డ్ వార్ ముదురుతోంది. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పైన కొందరు హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని పైన ఏపీ మంత్రులు సైతం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఏపీలో ముదురుతున్న సినీ వివాదం
ఇదే సమయంలో సినిమా థియేటర్లలో సోదాలు.. సీజ్ చేయటం వ్యవహారాన్ని మరింత జటిలం చేసింది. తాజాగా, ఎగ్జిబిటర్లు మంత్రి పేర్ని నానితో సమావేవమయ్యరు. వారు టిక్కెట్ల ధరల పెంపు పైన ప్రతిపాదనలు చేసారు. త్వరలోనే ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని లైసెన్సులు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం పైన ఆ కమిటీ సూచనలు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో మంత్రి పేర్ని నాని కీలక అంశాలను వెల్లడించారు. ఒక టీవీ చర్చలో పలు అంశాలను ప్రస్తావించారు. అసలు సినీ పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారనేది వెల్లడించారు.

సీఎం జగన్ కోరుకుంటోంది ఇదే
మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున టీం వచ్చిన సమయంలో రెవిన్యూ 70 శాతం ఏపీలో చూస్తోందని... అలా కాకుండా.. పోస్టు - ప్రీ పొడక్షన్ ఏపీలో డెవలప్ చేయాలని సీఎం వారిని కోరారని వెల్లడించారు. చిరంజీవి సైతం ఆ సమయంలో ముందుకు వచ్చి సానుకూలంగా స్పందించారనేది తనకు ఉన్న సమాచారమని మంత్రి నాని స్పష్టం చేసారు. ప్రభుత్వం పరిశ్రమతో లిబరల్ గానే ఉంటుందని..పద్దతి ప్రకారం వెళ్లాలని మాత్రమే సూచిస్తున్నామన్నారు. ప్రజలు ఆదిరిస్తేనే చంద్రబాబు అయినా.. జగన్ అయినా పెద్ద లీడర్లు అయ్యారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఈ డైరెక్టర్లు..హీరోలు అయినా వారు ఏ విధంగా ఎదిగారో... ప్రజల పట్ల కొంత బాధ్యత ఉండాలని సూచించారు. సినిమా ఏపీలోని కోనసీమలో ఎంత తీస్తో బాగుంటుందో ఆలోచన చేయాలన్నారు.

క్రమేణా సీఎం ఆలోచనలు వెల్లడిస్తారు
ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. అప్లికేషన్ పెట్టుకోండి..ఉచితంగా షూటింగ్ చేసుకోమని చెబుతున్నామన్నారు. సినిమా కలెక్షన్ 70 శాతం ఏపీ నుంచే వస్తోందని...అందులో ప్రీ లేదా పోస్టు ప్రొడక్షన్ ఆ దామాషాలో ఏపీలో జరిగేలా చేయాలని సీఎం ఆలోచనగా మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆ దిశగా ముఖ్యమంత్రి దశల వారీగా ప్రణాళికలు బయట పెడతారని మంత్రి నాని చెప్పుకొచ్చారు. ఇక, తాము ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు చెందిన థియేటర్ల లోనే సోదాలు చేయటం పైన మంత్రి క్లారిటీ ఇచ్చారు.

సీఎంకు థియేటర్లలో వాటాలో ఉన్నాయి
అసలు ముఖ్యమంత్రి జగన్ కే బెజవాడలోని ప్రముఖ జంట ధియేటర్లు ఉన్నాయని వెల్లడించారు. ఆ జంట థియేటర్లలో సీఎం కు వాటా ఉందని స్పష్టం చేసారు. సీఎం మేనమాకు కడపలో సినిమా థియేటర్ ఉందని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. తము సెప్టెంబర్ లోనూ ప్రభుత్వ అనుమతులు...ఫైర్ లైసెన్సులు తీసుకోమని చెప్పామని.. ఎవరైతే అవి లేకుండా నడుపుతున్నారో..వాటి పైనే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసారు. తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని..ఎవరు వచ్చినా వారి సమస్యలు వింటామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.












Click it and Unblock the Notifications