అమ్మకు ప్రేమతో..సీఎం జగన్ - వైఎస్ షర్మిల ట్వీట్లు..!!
ముఖ్యమంత్రి జగన్ తన తల్లికి విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ తల్లితో కలిసి ఫొటోతో జగన్ ట్వీట్ చేశారు. వైఎస్పార్టీపీ అధినేత్రి షర్మిల కూడా విజయమ్మ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్ డే అమ్మా..అనంతమైన ప్రేమకు ధన్యవాదాలు..ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా అంటూ ఆప్యాయంగా ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డితో సహా పలువురు ప్రముఖులు విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు వైఎస్ విజయమ్మ జన్మదినం. తల్లి విజయమ్మకు ఇద్దరు బిడ్డలు జగన్, షర్మిలతో పాటుగా కుటుంబ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ గత ఏడాది జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు, వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్న అంశాన్ని విజయమ్మ ప్రస్తావించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారని, తెలంగాణలో తన తండ్రి ఆశయాలను నెరవేర్చటానికి షర్మిల కష్టపడుతున్నారని విజయమ్మ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో షర్మిలకు అండగా నిలవాల్సిన బాధ్యత తనపైన ఉందని విజయమ్మ చెప్పుకొచ్చారు.
You are a beautiful soul ma;
— YS Sharmila (@realyssharmila) April 19, 2023
Thank you for your infinite love!
Happy Birthday mom!
Happiness always to you!! #HappyBirthdaymom pic.twitter.com/PslmZml4ry
తన కారణంగా సీఎం జగన్, వైసీపీ పైన విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విజయమ్మ వివరించారు. షర్మిల పాదయాత్ర, పార్టీ సభల్లోనూ విజయమ్మ పాల్గొన్నారు. తన బిడ్డకు అండగా నిలవాలని తెలంగాణ ప్రజలను పలుమార్లు కోరారు. వైఎస్సార్ జన్మదినం..వర్దంతి రోజున వైఎస్సార్ కుటుంబం మొత్తం ఇడుపుల పాయలో కలుసుకుంటోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో షర్మిలకు మద్దతుగా విజయమ్మ కొనసాగుతున్నారు. ఈ సమయంలో ఇటు వైసీపీ నేతలు, అటు వైఎస్సార్టీపీ ముఖ్య నేతలు విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
Happy Birthday Amma! pic.twitter.com/4VYU6vwDxB
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2023












Click it and Unblock the Notifications