సమంత, నీహారిక బాటలో కలర్స్ స్వాతి?
బుల్లితెరపై యాంకర్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించి కాలర్స్ స్వాతి తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆడవారిమాటలకు అర్థాలే వేరులే, కార్తికేయ సినిమాలతో మంచి హిట్లు దక్కినప్పటికీ తెలుగమ్మాయి కావడంవల్లే సినిమాల్లో అవకాశాలు రాలేదనది ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టే వార్త. అయితే ఇతర భాషల్లో మంచి ఆఫర్లు దక్కించుకుంది. 2018లో వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైంది.
మలయాళీ కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ వాసును స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంపత్య జీవితం బాగుందంటూ కొన్ని ఫొటోలను, వీడియోలను షేర్ చేసేది. ఇద్దరూ థాయ్ లాండ్ లో సెటిలయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే మీడియాలో కనపడుతుండేవారు. 2020లో తొలిసారిగా స్వాతి దాంపత్య జీవితం గురించి పుకార్లు వచ్చాయి. స్వాతి తన భర్త వికాస్ నుండి విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు మొదలయ్యాయి.

ఆ సమయంలో స్వాతి తన భర్త ఫోటోలు షేర్ చేయడంతో విడాకుల గురించి పుకార్లు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు కొత్తగా మొదలయ్యాయి. ఇన్ స్టా గ్రామ్ లో స్వాతి ఇటీవల తన భర్త వికాస్ ఫొటోలను డిలిట్ చేసినట్లుగా ఆమె ఫాలోవర్స్ చెబుతున్నారు. సమంత, నీహారిక, శ్రీజ లా విడాకులు తీసుకోవడానికి ముందు సోషల్ మీడియాలో ఉన్న తన భర్త ఫొటోలను డిలిట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. గతంలో తన భర్త ఫొటోలు షేర్ చేసి పుకార్లను ఖండించినట్లుగానే మరోసారి స్వాతి తన విడాకుల వార్తలు కేవలం పుకార్లే అంటూ తేల్చి చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. తెలుగులో ఎటువంటి చిత్రం చేయడంలేదుకానీ.. తమిళంలో మాత్రం ఒక సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications