పవన్ కళ్యాణ్‌తో బంధంపై అలీ కౌంటర్
జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఉత్సవం' సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అలీ.. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.పవన్ కళ్యాణ్‌తో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అలీ సమాధానం ఇస్తూ.. మా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని నవ్వులు పూయించారు అలీ.
ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా పని చేస్తానని ఈ సందర్భంగా అలీ వివరణ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు పవన్ కల్యాణ్‌ను కాదని అలీ వైసీపీలో చేరారు. ఆ సందర్భంలో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఆయన వైసీపీలో ఉన్న సమయంలో పవన్ అభిమానులు అలీపై దారుణంగా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సైతం అలీ కూడా నన్ను మోసం చేశాడని విమర్శించారు.

పవన్ తనపై చేసిన కామెంట్స్‌కు అలీ కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. మీవల్ల తానేమి ఇండస్ట్రీలో పైకి రాలేదని అలీ పవన్‌పై సెటైర్స్ వేయడం జరిగింది. అప్పటి నుంచి అలీ, పవన్ కల్యాణ్‌ల మధ్య గ్యాప్ వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. సీటు విషయంలో ఆశ భంగం కలిగింది. దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలీ పవన్ కల్యాణ్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఆయన పవన్‌పై కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications