తుఫానులు ఏపీని చుట్టుముట్టనున్నాయ్!: చంద్రబాబు హెచ్చరిక

Subscribe to Oneindia Telugu
  Chandrababu Need to finish Polavaram project by 2018 తుఫానులు ఏపీని చుట్టుముట్టనున్నాయ్!| Oneindia

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు తుఫానుల ముప్పు పొంచి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్టోబర్ మూడవ వారం నుంచి నవంబర్ మొదటి వారంలోపు మూడు తుపానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుట్టుముట్టనున్నాయని ఇస్రో హెచ్చరికలు జారీ చేసిందని ఆయన చెప్పారు.

  మూడు తుఫానులు..

  మూడు తుఫానులు..

  ఏపీకి వచ్చే నెల మూడో వారం.. నవంబరు తొలి వారం మధ్య మూడు తుపాన్ల తాకిడి ప్రమాదం ఉందన్న ఇస్రో నిపుణుల సమాచారంపై అధికారులు అప్రమత్తం కావాలని, పంట దిగుబడులు కాపాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. తుఫాను నష్టాలను తగ్గించుకునేందుకు ఆధునిక సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిపంటను కనీస మద్దతు ధరకు కొని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

  పోలవరం పనులు ఆగొద్దు..

  పోలవరం పనులు ఆగొద్దు..

  ఏవేవో కారణాలతో పోలవరం ప్రాజెక్టు పనులు ఒక్కరోజు కూడా ఆపడానికి కుదరదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేగాక, నిధుల సమస్య లేదని, కాపర్‌ డ్యాం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న వాటితో పనులు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన సోమవారం స్వయంగా పరిశీలించారు. స్పిల్‌వే, గేట్ల తయారీ పనులను పరిశీలించి అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష జరిపారు.

  2018నాటి పూర్తి..

  2018నాటి పూర్తి..

  ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్‌ డ్యాం పనులు నవంబరులో ప్రారంభిస్తామని, స్పిల్‌వేలో 48 గేట్ల పనులు జరుగుతున్నాయని, స్పిల్‌ఛానల్‌ లైనింగ్‌ పనులు, ఐకానిక్‌ వంతెన పనులు అక్టోబరులో ప్రారంభిస్తామని సీఎం వివరించారు. 960 మెగావాట్ల విద్యుత్తు కేంద్ర నిర్మాణ పనులకు టెండర్లు పిలుస్తున్నామని, మట్టి పని 71 శాతం పూర్తయిందని, మిగిలినది 2018 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

  నిర్వాసితులకు న్యాయం.. వారిపై కఠిన చర్యలు

  నిర్వాసితులకు న్యాయం.. వారిపై కఠిన చర్యలు

  గోదావరిలో నీరు తగ్గిన వెంటనే నవంబరు నుంచి డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ఆ పొలాలకు సాగునీరు అందిస్తామన్నారు. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌లో నిర్వాసితులకు అన్యాయం చేసే ప్రసక్తి లేదని చెప్పారు. బినామీ వ్యక్తుల ద్వారా పరిహారం పొందడానికి ప్రయత్నించినా, రికార్డులు తారుమారు చేసినా అటువంటి వ్యక్తులపైనా, అధికారులు, సిబ్బందిపైనా కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

  కైలాస్ సత్యర్థికి కృతజ్ఞతలు

  కైలాస్‌ సత్యార్థి చేపట్టిన ‘సురక్షిత బాల్యం-సురక్షిత భారత్‌' పాదయాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు సత్యార్థి పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో ఆయన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి స్పందించిన చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా, సద్గురు జగ్గీవాసుదేవ్‌ చేపట్టిన ‘ర్యాలీ ఆఫ్‌ రివర్స్‌'తో నదుల గొప్పతనం, వాటి పరిరక్షణపై అవగాహన ప్రజల్లో పెరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ర్యాలీ ఆఫ్ రివర్స్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chief Minister N. Chandrababu Naidu has expressed concern over the delay in the progress of various components of the Polavaram Irrigation Project, in the last two months.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి