ఎందుకనేది మిస్టరీయే: ఇంటికి టెక్కీ భవ్యశ్రీ (పిక్చర్స్)
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ ఇంటి గడప దాటి బయటకు వెళ్లిపోవడం వెనక గల మిస్టరీ ఏమిటనేది తెలియడం లేదు. ఈ విషయంపై పోలీసులు గానీ, భవ్యశ్రీ కుటుంబ సభ్యులు గానీ నోరు విప్పడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను విశాఖపట్నం వెళ్లినట్లు భవ్యశ్రీ చెబుతోందని, ఆ వ్యక్తిగత కారణాలేమిటనేది తమకు తెలియదని పోలీసులు అంటున్నారు.
తన భార్య భవ్యశ్రీ అదృశ్యమైనట్లు భర్త కార్తిక్ చైతన్య ఫిర్యాదు చేశాడని, తమ బాధ్యతగా గాలించి తీసుకుని వచ్చి అతడికి అప్పగించామని పోలీసులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీమూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆమెను పోలీసులు విశాఖపట్నంలో పట్టుకున్నారు.
తొమ్మిదో తేదీన కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని ఇంటి నుంచి హైటెక్ సిటీలో గల ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్ కార్యాలయానికి ప్రైవేటు క్యాబ్‌లో బయలుదేరి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విషయం నగరంలో సంచలనం కలిగించింది. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన కేసులోని మిస్టరీ ఆదివారం వీడిపోయింది.

ఇంటికి భవ్యశ్రీ
భవ్యశ్రీ సెల్‌ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు ఆమె వైజాగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేక బృందం భవ్యశ్రీని వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చింది.

ఇంటికి భవ్యశ్రీ
అనంతరం ఆమెను భర్త కార్తీక్ చైతన్యకు అప్పగించారు. వ్యక్తిగత కారణాల వల్లే భవ్యశ్రీ ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు తెలిపారు. అదే విషయాన్ని ఆమె చెప్పిందన్నారు.

ఇంటికి భవ్యశ్రీ
భవ్యశ్రీ ఒంటరిగానే పారిపోయిందని వివరించారు. హైదరాబాదు నుంచి బయలుదేరిన భవ్యశ్రీ చివరకు వైజాగ్‌లో దొరికింది.

ఇంటికి భవ్యశ్రీ
భవ్యశ్రీ, కార్తిక్ చైతన్య దగ్గరి బంధువులు. వారు విజయవాడుకు చెందినవారు. హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.

ఇంటికి భవ్యశ్రీ
రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌కు తిరిగి రవాడానికి భవ్యశ్రీ సిద్ధమైనట్లు చెబుతున్నారు. కాగా, సికింద్రబాద్ నుంచి వైజాగ్‌కు ఆమె రైలు టికెట్లు బుక్ చేసకుంది.

ఇంటికి భవ్యశ్రీ
భవ్యశ్రీ తాను కార్యాలయానికి వెళ్తున్నట్లు భర్త కార్తిక్ చైతన్యకు చెప్పింది. అయితే, ఆమె అప్పటి నుంచి కనిపించుకుండా పోయింది.

ఇంటికి భవ్యశ్రీ
విజయవాడకు చెందిన భవ్యశ్రీ, కార్తిక్ చైతన్య సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తూ హైదరాబాదులోని కెపిహెచ్‌బి కాలనీలో నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications