Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన కరోనా పాజిటివ్ ఉన్న మర్డర్ కేసు నిందితుడు

కరోనా పోలీసులకు కొత్తకష్టాలు తెచ్చిపెడుతోంది. ఒకపక్క కరోనా సోకి చాలా మంది పోలీసులు బాధపడుతుండగా, మరోపక్క కరోనా సోకిన ఖైదీలను పారిపోకుండా ఆపడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇక అలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

కరోనా పాజిటివ్ తో బాధపడుతున్న ఒక మర్డర్ కేసు నిందితుడు క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకుని పారిపోయిన ఘటన ఏపీలో జరిగింది. ఇక ఇలాంటి ఘటనలు పోలీసులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నూడిల్స్ బండి యజమానిని మర్డర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న ఒక వ్యక్తి , ప్రస్తుతం గన్నవరం సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అతనికి కరోనా సోకడంతో, కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.నిన్న సాయంత్రం నుండి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న నిందితుడు రాత్రి 10 గంటల సమయంలో క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు.

Corona patient who is a remand prisoner escaped from the quarantine center

గుర్తించిన అధికారులు నిందితుని కోసం గాలిస్తున్నారు. తప్పించుకున్న నిందితుడు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి సమీపంలోనే లింగం పల్లి గ్రామానికి చెందిన వాడిని, చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధ అయిన అతను ఒక స్వచ్ఛంద సంస్థలో పెరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతను స్మశాన వాటిక లో నిద్ర పోతాడు అని చెప్తున్న కంకిపాడు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మర్డర్ కేసు నిందితుడు తప్పించుకుని పారిపోవడం ఒక ఎత్తయితే,అతను కరోనా పాజిటివ్ తో బాధ పడుతున్న నేపథ్యంలో,అతని ద్వారా ఎంతమంది కరోనా బాధితులుగా మారతారో అన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

Recommended Video

    Covaxin Human Trials News: Bharat Biotech's Coronavirus Vaccine ధరపై గుడ్ న్యూస్..!! || Oneindia

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+