ఏపీ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం ... అసలేం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కరోనా ఇప్పట్లో తగదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో జనజీవనం సాధారణంగా మారేలాగా చర్యలు చేపడుతోంది. అంతేకాదు కరోనా నియంత్రణ కోసం కూడా ఏపీ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శంకర్ నారాయణ కుటుంబంలోని ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణకి మాత్రం కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. మంత్రి శంకర్ నారాయణ మేనత్త అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి చెందిన అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ అని తేలింది. అయితే ఈ రిపోర్టు ఆమె అంత్యక్రియల తర్వాత వచ్చింది. ఇక మేనత్త అంత్యక్రియల్లో మంత్రితో పాటు పలువురు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. దీంతో మంత్రి, కుటుంబ సభ్యులకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

 corona tension to AP Minister Shankar Narayanas family

ఈ రిపోర్ట్స్‌లో మంత్రి శంకర్ నారాయణకు నెగిటివ్ వచ్చింది. అయితే ప్రస్తుతం మంత్రి కుటుంబం మొత్తం కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక ఏపీలో తాజా పరిస్థితి చూస్తే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది . ఇప్పటివరకు ఏపీ లో నమోదైన కేసులు చూస్తే 3571 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసులను 1169 కేసులు యాక్టివ్ గా ఉండగా, 2340 కేసులు కరోనా బారి నుండి బయటపడి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజా పరిణామాలతో కరోనా ఎప్పుడు ఎవరికి అటాక్ అవుతుందో అన్న భయం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+